Rohit Sharma: హిట్‌మ్యాన్ పనైపోయిందా? రోహిత్ ఫామ్‌పై ఆందోళన

టీమ్ఇండియా సారథి, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాట్ మూగబోయిందా? మునుపటిలా అతడు జోరు కొనసాగించలేకపోతున్నాడా? అంటే అవునని సగటు క్రీడా అభిమాని ఇట్టే చెప్పేస్తాడు. ఎందుకంటే ప్రస్తుతం రోహిత్ ఫామ్ అలా ఉంది మరి. పరుగుల సంగతి పక్కన బెడితే.. కనీసం క్రీజులో నిలదొక్కుకునేందుకు కూడా రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు. మరోవైపు తన సారథ్యంలో(Capatancy)నూ మునుపటి చురుకుదనం కనిపియడం లేదు. దీంతో టీమ్ఇండియా(Team India)కు వరుస పరాజయాలు తప్పడం లేదని ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. తాజాగా అడిలైడ్ టెస్టు(Adelaide Test)లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3, సెకండ్ ఇన్నింగ్స్‌లో 6 రన్స్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొటున్నాడు.

ఆస్థాయి ప్రభావం ఎక్కడ?

ప్రస్తుత క్రికెట్‌లో రోహిత్ శర్మ బెస్ట్ ప్లేయర్(Best player) అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫార్మాట్లకు అతీతంగా అతడు అద్భుతంగా ఆడుతూ వస్తున్నాడు. అయితే లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌(Limited Overs Cricket)లో టాప్ బ్యాటర్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్న హిట్‌మ్యాన్(HitMan).. టెస్టుల్లో మాత్రం ఆ స్థాయిలో ప్రభావం చూపించలేకపోతున్నాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అతడు దారుణంగా విఫలమవుతున్నాడు. 6, 3, 11, 18, 8, 0, 52, 2, 8, 23, 5, 6.. గత 12 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ బ్యాట్ నుంచి వచ్చిన స్కోర్లు ఇవి. ఇందులో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. సెంచరీ(Century) ప్రస్తావన కూడా మర్చిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.

అతడి బ్యాటింగ్ వైఫల్యమే కారణం

బ్యాటర్‌గా రోహిత్ రాణిస్తే.. టీమ్‌లోని ఇతర ఆటగాళ్లు కూడా తాము మరింత బాధ్యతతో ఆడాలని భావిస్తారు. తాను పరుగులు చేయడం ద్వారా ఇతర ప్లేయర్లకు హిట్‌మ్యాన్ ఉదాహరణగా నిలవాలి. కానీ అతడి బ్యాటే(Bat) మూగబోతుంటే.. ఇంక మిగతా వారి సంగతి చెప్పనక్కర్లేదు. రోహిత్ త్వరగా ఔట్ అవడం వల్ల మిడిలార్డర్ బ్యాటర్లపై ప్రెజర్(Pressure) పడుతోంది. దీని వల్ల జట్టు భారీ స్కోర్లు సాధించలేకపోతోంది. తాజా అడిలైడ్ టెస్ట్‌తో పాటు న్యూజిలాండ్ సిరీస్‌‌(New Zealand series)లో టీమిండియా ఓడిపోవడానికి అతడి బ్యాటింగ్ వైఫల్యం ఒక కారణమనే చెప్పాలి. మరోవైపు టెస్టులకు రోహిత్ సెట్ అవ్వడని.. లాంగ్ ఫార్మాట్‌కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *