క్రికెట్ అభిమానులకు మళ్లీ అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL-2025) వచ్చేసింది. భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల(India-Pak War Crisis)తో వాయిదా పడ్డ ఐపీఎల్ 2025.. ఈరోజు (మే 17) నుంచి పునఃప్రారంభం కానుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్(RCB vs KKR) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో RCB సూపర్ ఫామ్‌లో ఉంది. అదే ఊపులో ప్లేఆఫ్స్ దిశగా దూసుకెళ్తోంది. ఇవాళ్టి మ్యాచులో కేకేఆర్‌పై గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. అటు దాదాపుగా టాప్-4కి దూరమైన KKR ఈ మ్యాచ్‌లో గెలిచి ఆర్సీబీని ఇరకాటంలోకి నెట్టాలని భావిస్తోంది.
ప్లేఆఫ్స్‌కు అడుగు దూరంలో ఆర్సీబీ
రజత్ పాటీదార్ సారథ్యంలోని RCB లీగ్‌లో ఇప్పటికే 11 మ్యాచ్‌లాడి 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అడుగుదూరంలో ఉంది. కోల్‌కతాపై నెగ్గి నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు 12 మ్యాచ్‌లాడి 11 పాయింట్లతో ఉన్న డిఫెండింగ్ చాంపియన్, రహానే కెప్టెన్సీలోని నైట్‌రైడర్స్‌కు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరుజట్ల మధ్య జరిగే ఈ రసవత్తర పోరు అభిమానులను అలరించడం ఖాయం.

మ్యాచ్‌కు పొంచి ఉన్న వర్షం ముప్పు
ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో జరగాల్సి ఉంది. టెస్టులకు రిటైర్మెంట్ పలికిన తర్వాత విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. దీంతో ఈ మ్యాచ్‌పై RCB ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వాతావరణ శాఖ(IMD) అంచనాల ప్రకారం మ్యాచ్ జరిగే రోజైన శనివారం అక్కడ వర్షం పడే అవకాశం ఉంది. కాగా శనివారం రాత్రి 7 గంటలకు టాస్ పడి.. 7.30 మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రాత్రి 7 గంటలకు 71% వర్షం పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. రాత్రి 8 గంటలకు 69%, రాత్రి 9 గంటలకు 49%, రాత్రి 10 గంటలకు 34% వర్షం పడే అవకాశం ఉందని IMD తెలిపింది.
Weather watch ahead of #IPL2025‘s resumption in Bengaluru tomorrow… 🌧️ pic.twitter.com/99RjgeqKl7
— Cricbuzz (@cricbuzz) May 16, 2025






