ఐపీఎల్‌లో (IPL 2025) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. లక్నో(Lucknow) వేదికగా… సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ హైదరాబాద్ కు పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా, బెంగళూరుకు మాత్రం చాలా కీలకం. ఇందులో గెలిస్తే పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వెళుతుంది. మొదటి స్థానంలో ఉన్న జట్టుకు ప్లేఆఫ్స్‌లో అడ్వాంటేజ్ ఉంటుంది.

బెంగళూరు భరతం పట్టేందుకు..
ఈ నేపథ్యంలో SRHను ఓడించి మొదటి స్థానానికి వెళ్లాలని బెంగుళూరు కసరత్తులు మొదలుపెట్టింది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ జట్టును ఓడించడం సులభమేమీ కాదు. మొన్న LSGని చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపించింది హైదరాబాద్. ఇప్పుడు బెంగళూరు భరతం పట్టేందుకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. అటు ఇవాల్టి మ్యాచ్లో కూడా హెడ్ ఆడటం కష్టమే అని తెలుస్తోంది. కరోనా బారిన పడటంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇక ఐపీఎల్ హిస్టరీలో ఇరుజట్లు ఇప్పటివరకు 24 సార్లు తలపడగా బెంగళూరు 11, హైదరాబాద్ 13 సార్లు గెలిచాయి.

తుది జట్ల అంచనా..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జాకబ్ బెథెల్, రజత్ పాటిదార్ (C), జితేష్ శర్మ (WK), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలామ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్: అథర్వ తైదే, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), హెన్రిచ్ క్లాసెన్, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, నితీష్ రెడ్డి, పాట్ కమిన్స్ (C), హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ






