IPL 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపిన రజత్ సేన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS)ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో బెంగళూరు ఫైనల్(Final)కు వెళ్లింది. అటు అన్ని విభాగాల్లో విఫలమైన పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరేందుకు క్వాలిఫయర్-2లో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
𝙏𝙝𝙖𝙩’𝙨 𝙝𝙤𝙬 𝙮𝙤𝙪 𝙨𝙚𝙖𝙡 𝙖 𝙥𝙡𝙖𝙘𝙚 𝙞𝙣 𝙩𝙝𝙚 𝙛𝙞𝙣𝙖𝙡𝙨 ❤
🎥 Captain Rajat Patidar fittingly finishes off in style as #RCB are just one step away from the 🏆
Updates ▶ https://t.co/FhocIrg42l#PBKSvRCB | #Qualifier1 | #TheLastMile | @RCBTweets pic.twitter.com/hXhslIqcDZ
— IndianPremierLeague (@IPL) May 29, 2025
14.1 ఓవర్లలో 101 పరుగులకే..
చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్(Mullanpur) స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఛాలెంజర్స్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్(Rajat Patidar) ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ RCB బౌలర్లు ఆది నుంచే పంజాబ్ బ్యాటర్లపై నిప్పులు చెరిగారు. దీంతో కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్ 3, హేజిల్ వుడ్ 3, యశ్ 2 వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్, షెఫర్డ్ చెరో వికెట్ తీశారు.
ఫిలిప్ సాల్ట్ ధనాధన్ ఇన్నింగ్స్
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(Phill Salt) అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు. సాల్ట్ కేవలం 27 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 56 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ (12) త్వరగానే ఔటైనా, ఆ తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్ (19) దూకుడుగా ఆడాడు. చివర్లో కెప్టెన్ రజత్ (8 బంతుల్లో 15*) సాల్ట్‌తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆర్సీబీ కేవలం 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 106 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది. పంజాబ్ బౌలర్లలో జేమీసన్, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీశారు.
#RCBvsPBKS#Qualifier1
Congratulations RCB pic.twitter.com/A0zMaZists— Nishank (@Nishank50312714) May 30, 2025
ఫైనల్ మ్యాచ్ ఎవరితోనో?
టోర్నీలో ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరగనుంది. రేపు గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్(GT vs MI) మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్(PBKS)తో తలపడాల్సి ఉంటుంది. క్వాలిఫయర్-2 మ్యాచ్ జూన్ 1న జరగనుంది. క్వాలిఫయర్-2లో నెగ్గిన జట్టు ఫైనల్లో RCBతో ఆడుతుంది.






