ఐపీఎల్ 2025లో ఎట్టకేలకు సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జూలు విదిల్చింది. ఈ సీజన్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(RR)తో జరిగిన మ్యాచులో RCB 11 రన్స్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆర్సీబీ నిర్దేశించిన 206 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రాజస్థాన్‌కు చివరి 2 ఓవర్లలో 18 పరుగులు కాగా.. కేవలం 7 పరుగులు చేసి విజయం ముంగిట బొక్కబోర్లా పడింది. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో 3వ ప్లేస్‌కి చేరి ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగు పర్చుకుంది. అటు రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచుల్లో 7 ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు టాప్-4లోకి వెళ్లడం కష్టమే.
Winning at home is special.❤#RCBvRR #PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/yz3eEygo3X
— Rajat Patidar (@rjjtt_01) April 24, 2025
ఓ వైపు కింగ్ కోహ్లీ.. మరోవైపు పడిక్కల్
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన RCB విరాట్ కోహ్లీ (70 పరుగులు, 42 బంతుల్లో), దేవదత్ పడిక్కల్ (50 పరుగులు, 27 బంతుల్లో) అద్భుత ప్రదర్శన చేశారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం అందించారు. సాల్ట్ (26), ఆ తరువాత టిమ్ డేవిడ్ (23), జితేష్ శర్మ (19 నాటౌట్) చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయడంతో ఆర్సీబీ 205/5 భారీ స్కోర్ చేసింది. రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ 2 వికెట్లు, ఆర్చర్, హసరంగ చెరోవికెట్ తీశారు.
గెలిచే అవకాశం ఉన్నా.. చేజేతులా ఓడింది
అనంతరం 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. యశస్వీ జైస్వాల్ (49), నితీష్ రాణా (28), ధ్రువ్ జురేల్ (47) ధాటిగా ఆడినా ప్రయోజనం లేకపోయింది. ఒకానొక దశలో గెలిచే ఛాన్సున్నా ఆ జట్టు ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 194/9 స్కోర్‌కే RR పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు, కృనాల్ పాండ్య 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ చెరో వికెట్ తీశారు. 4 వికెట్లతో సత్తా చాటిన హేజిల్‌వుడ్‌కి ‘ Man of The Match’ అవార్డు దక్కింది.






