RCB vs CSK: ఉత్కంఠ పోరులో CSKపై బెంగళూరు ఘనవిజయం

ఐపీఎల్‌(IPL 2025)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) సూపర్ విక్టరీ సాధించింది. చివరి బంతి వరకూ నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచులో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో బంపర్ విజయం సాధించింది. చెన్నై విజయానికి చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా 12 పరుగులు మాత్రమే చేసింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన యశ్ దయాల్(Yash Dayal) ధోనీ(Dhoni) వికెట్ తీసి బెంగళూరుకు మరపురాని విజయాన్ని అందించాడు. ఈ విజయంతో RCB ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోగా.. చెన్నై పాయింట్ల పట్టికలో చివరి స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

Tanuj on X: "Jacob Bethel said - "It's really cool you walk up with Virat  Kohli and bat with him. I try to match his Intensity and I would like to do

మాత్రే సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగినా..

బెంగళూరు నిర్దేశించిన 214 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై ఓపెనర్లు మాత్రే, రషీద్ 4.3 ఓవర్లలోనే 51 పరుగులు అందించారు. ఈ క్రమంలో రషీద్ (14) ఔటైనా మరో ఎండ్‌లో యంగ్ ఓపెనర్ ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94) సూపర్ ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇతడికి రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77*) కూడా జతకట్టడంతో చెన్నై విజయం వైపు నడిచింది కానీ చివర్లో మాత్రే, సామ్ కరణ్ (5), బ్రెవిస్ (0), ధోనీ (12) వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలోకి వెళ్లింది. చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా 12 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3, దయాల్, పాండ్య చెరో వికెట్ తీశారు.

IPL 2025: Who Is Ayush Mhatre? 17-Year-Old Chennai Super Kings Sensation  Who Is Making Debut Against Mumbai Indians | Republic World

చెన్నైపై షెఫర్డ్ ఊచకోత

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 213/5 భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ ఓపెనర్లు బెథెల్ (55), కోహ్లీ (62) పరుగులతో రాణించగా.. చివర్లో రొమారియో షెఫర్డ్ (14 బంతుల్లోనే 53) మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. చెన్నై బౌలర్లలో పతిరణ 3, సామ్ కరన్, నూర్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన రొమారియో షెఫర్డ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *