రైల్వేలో భారీ ఉద్యోగాలు.. 32,438 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​

రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? ఐతే మీకో శుభవార్త. తాజాగా రైల్వే శాఖ మీ కోసం ఓ తీపికబురు తీసుకువచ్చింది. 32,438 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ (Indian Railway Notification 2025) విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ విద్యార్హత ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-డి లెవెల్-1 కేటగిరిలో వివిధ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. అర్హులు జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పదో తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ (ITI) లేదా తత్సమాన విద్యార్హత లేదా NCVT జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్​షిప్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఇక అభ్యర్థుల వయస్సుజనవరి 1, 2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలని చెప్పారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఎఫిషియెన్సీ టెస్ట్ (PT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇందులో ఎంపికైన వారికి నెలకు ప్రారంభ వేతనం రూ.18000 ఇవ్వనున్నట్లు పేర్కొంది. జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ESM, EBC, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250 దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుందని వివరించింది.

పోస్టు వివరాలు – ఖాళీల సంఖ్య

1. పాయింట్స్‌మన్‌- 5,058

2. అసిస్టెంట్‌ (ట్రాక్‌ మెషిన్‌)- 799

3. అసిస్టెంట్‌ (బ్రిడ్జ్‌)- 301

4. ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4 – 13,187

5. అసిస్టెంట్‌ పీ-వే- 247

6. అసిస్టెంట్‌ (సీ అండ్‌ డబ్ల్యూ)- 2587

7. అసిస్టెంట్‌ లోకో షెడ్‌ (డిజిల్‌)- 420

8. అసిస్టెంట్‌ (వర్క్‌షాప్‌)- 3077

9. అసిస్టెంట్‌ (ఎస్‌ అండ్‌ టీ)- 2012

11. అసిస్టెంట్‌ లోకో షెడ్‌ (ఎలక్ట్రికల్‌)- 950

12. అసిస్టెంట్‌ ఆపరేషన్స్‌- (ఎలక్ట్రికల్‌)- 744

13. అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్‌ ఏసీ- 1041

14. అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్ ఏసీ (వర్క్‌షాప్‌)- 625

నోటిఫికేషన్ లో ముఖ్య వివరాలు ఇవే..

  1. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23.01.2025
  2. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-02-2025
  3. దరఖాస్తుల సవరణకు తేదీలు: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు
  4. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు.

Online application ఇక్కడ క్లిక్ చేసి ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Related Posts

SBI Jobs: ఎస్‌బీఐలో జూనియర్‌ అసోసియేట్స్‌ పోస్టులు.. అప్లై చేయండిలా!

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ(SBI)లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. దేశ వ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో ఐదు వేలకు పైగా జూనియర్‌ అసోసియేట్స్‌ (Customer Support and Sales) పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ దరఖాస్తులను…

Cognizant: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్.. డిసెంబరులోపు భారీ నియామకాలు

ఐటీ సేవల రంగంలో అగ్రగామిగా ఉన్న కాగ్నిజెంట్‌(Cognizan) సంస్థ 2025లో 15,000–20,000 మంది ఫ్రెషర్లను నియమించాలన్న లక్ష్యంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ మధ్యకాలంలో ఈ సంస్థ 7,500 మందిని నియమించుకుంది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *