భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ ఆర్‌ఆర్‌ఆర్ (Rice Rore Revolt). ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రాజమౌళి (SS RajaMouli) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌తోపాటు పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. అయితే ఇప్పుడు ఈ టీమ్ ప్రేక్షకులకు ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాపై డాక్యుమెంటరీ సిద్థం చేసినట్లు తెలిపింది.
తెరవెనుక ఏం జరిగిందో చెప్పేలా..
ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ ( : & ) పేరుతో ఈ డాక్యుమెంటరీని (documentary) విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్ కీర్తిని ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు దీని కథకు ప్రపంచం సాక్ష్యంగా నిలవనుంది’ అంటూ డాక్యుమెంటరీ గురించి వెల్లడించింది. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలిపింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తెరవెనక ఏం జరిగింది.. దీన్ని ఎలా రూపొందించారో ఇందులో చూపనున్నారు. అయిత ఈ డాక్యుమెంటరీని థియేటర్లలో విడుదల చేస్తారా? లేక ఓటీటీలోకి తీసుకొస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు
రామ్‌చరణ్ (Ram Charan) అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ (NTR) కొమురం భీమ్ పాత్రలతో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ సత్తా చాటింది. అలాగే దీన్ని పలు భాషల్లో అనువాదం చేయగా అక్కడ కూడా రికార్డులు నెలకొల్పింది. జపాన్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టి 300 మిలియన్ జపాన్ యెన్‌ల( రూ.18 కోట్లు) క్లబ్‌లో చేరింది. ఈ క్లబ్‌లో చేరిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.






