Mana Enadu: బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు(Diwali Wishes) తెలిపారు. ప్రజలంతా తమ కుటుంబాలతో హాయిగా గడపాలని కోరుకుంటున్నాని ట్వీట్(Tweet) చేశారు. అయితే ఈ సందర్భంగా ఆయన అధికార కాంగ్రెస్(Congress) పార్టీని ఉద్దేశించి అదే ట్వీట్‌లో సెటైరికల్‌గా విమర్శించారు. గత వారంలో మోకిల, తెలంగాణలో ఊహించని వేగంతో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా, పండుగల సందర్భంగా ప్రజలు కింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోమని చెప్పడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
* ఇంతకీ ఆయన ట్వీట్లో ఏముందంటే..
☛ మీ బంధుమిత్రులతో భోజనం(దావత్) చేసే ప్లాను ఉంటే ఇంటి ముందు బ్రీత్ అనలైజర్లను, డ్రగ్ టూల్ కిట్లను దగ్గర ఉంచుకుంటే మంచిది. నీళ్లు బాగా తాగండి. యూరిన్ శాంపిల్స్ అవసరం పడవచ్చు.
☛ మీ మ్యారేజ్ సర్టిఫికెట్, వచ్చే దోస్తుల కుటుంబాలను కూడా మారేజ్ సర్టిఫికెట్, పిల్లల బర్త్ సర్టిఫికేట్లు పదిలంగా ఉన్నయో లేదో చూసుకోమని చెప్పండి. లేకపోతే కుటుంబాలను పురుషులు-మహిళలు అనే ప్రమాదముంది.
☛ ప్రతి మందు పార్టీకి పర్మిషన్ ఉండాలని మంత్రులు అంటున్నారు! కావున స్థానిక పోలీసు స్టేషన్/ఎక్సైజ్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వండి.
☛ మీరంటే గిట్టని వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చి కుటుంబ సభ్యులు సరదాగా గడుపుతుంటే దాన్ని ‘రేవ్’ పార్టీ(Rave party) అనే ప్రమాదం ఉంది. పోలీసులు ఎక్సైజ్ అధికారులు, Sniffer Dogs, SOTలు ‘ఒక గంటలోనే’ మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి.
☛ ఇంట్లో, ఇంటి చుట్టూ CCTV కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో సరిచూసుకోండి. మీ టవర్ లొకేషన్స్ మీరే తెలుసుకోండి. లేదంటే మన హోంశాఖ సహాయ మంత్రిగారు ఊరుకోరు.
☛ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని ‘బిగ్’ యూట్యూబ్, మీడియా ఛానల్లు పండుగ భోజనాన్ని రేవ్ పార్టీ అని, మీ కుటుంబ సభ్యుల ఫొటోలతో తప్పుడు శీర్షికలతో వైరల్ చేసే ప్రమాదం ఉంది. వాళ్ల మీద పరువునష్టం దావాకు పైసలు రెడీగా పెట్టుకోండి.
☛ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ స్థానిక అధికార పార్టీ నాయకులను అడగండి. వాళ్ల దగ్గర చాలా విలువైన సమాచారం ఉంటది. అని ప్రవీణ్ కుమార్ సెటైరికల్ ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. 💐💐💐మీరందరు మీ కుటుంబాలతో హాయిగా గడపాలని కోరుకుంటున్నాను.
అయితే…
గత వారంలో మోకిల, తెలంగాణలో ఊహించని వేగంతో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా, పండుగల సందర్భంగా ప్రజలు కింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోమని చెప్పడం నా బాధ్యత గా భావిస్తున్న:…— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 31, 2024