Mana Enadu : రష్యా (Russia), ఉక్రెయిన్ ల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ దేశంపై రష్యా మరోసారి రెచ్చిపోయింది. ఉక్రెయిన్‌పై (Ukraine) 188 డ్రోన్లతో (drone attack) భీకర దాడికి తెగబడింది. 17 ప్రాంతాల్లో డ్రోన్ల దాడులు జరిగినట్టు ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. రష్యా.. ఈసారి రికార్డు స్థాయిలో డ్రోన్లను ప్రయోగించిందని తెలిపింది.
అయితే రష్యా ప్రయోగించిన డ్రోన్లలో చాలా వాటిని అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. ఈ దాడుల వల్ల భవనాలు, జాతీయ పవర్‌గ్రిడ్ సహా కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపింది. మరోవైపు సరిహద్దు ప్రాంతంలో ఉక్రెయిన్ ఉంచిన 39 డ్రోన్ల (Ukraine Drones Attack)ను తమ సైన్యం ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు.. ఉక్రెయిన్‌పై ఆక్రమణకు పాల్పడిన రోజే రష్యాలోని అణ్వాయుధాలను యుద్ధంలో వాడేందుకు సిద్ధంగా ఉంచారని ఆ దేశం నుంచి పారిపోయిన ఆంటోన్ అనే సైనికుడు తెలిపారు. రష్యా(Russia Drones Attack)లో ఓ అణుస్థావరానికి రక్షణ బృందంలో ఆఫీసర్‌గా పని చేసిన అతడిని ఇటీవల ఓ రహస్య ప్రదేశంలో బీబీసీ ఇంటర్వ్యూ చేయగా.. అందులో రష్యా అణుస్థావరాల్లోని పరిస్థితులను వివరించారు.
కీవ్‌పై దండ్రయాత్ర మొదలైన నాడే పూర్తిస్థాయి అణు దాడికి సిద్ధమైనట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన మూడు రోజుల తర్వాత పుతిన్ మాట్లాడుతూ.. అణుదళాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు ప్రకటించారని.. దాదాపు మూడు వారాల తర్వాత అణు స్థావరాల్లో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి తీసుకొస్తూ ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పుకొచ్చారు ఆంటోన్.






