ManaEnadu: భారత్, దక్షిణాఫ్రికా(TeamIndia vs South africa) మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. నాలుగు మ్యాచుల T20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ నెగ్గగా రెండో మ్యాచ్‌లో సఫారీలు గెలిచారు. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. కాగా నేడు సెంచూరియన్(Centurion) వేదికగా జరగనున్న మూడో మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ ఛానల్‌లలో ప్రసారమవుతుంది. అలాగే మొబైల్‌లో Jio Cinema యాప్ ద్వారా లైవ్ మ్యాచ్‌ను వీక్షించవచ్చు
టాస్ కీలకం
ఇదిలా ఉండగా సెంచూరియన్ వేదికగా తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువ సార్లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో నేడు టాస్(Toss) కీలకం కానుంది. తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్లు, బౌలర్లు.. రెండో దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్ సంజూ శాంసన్(Sanju Samson), కెప్టెన్ సూర్య, తిలక్ వర్మ ఫామ్‌లో ఉండటం టీమ్ఇండియాకు కలిసొచ్చే అవకాశం ఉంది. మరోవైపు యంగ్ ఓపెనర్ అభిషేక్ వర్మ ఫామ్ అభిమానులను కలవరపెడుతోంది. అతడు రెండు మ్యాచుల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఈ మ్యాచులో అభిషేక్ శర్మ (Abhishek Sharma)పై వేటు పడే అవకాశముంది. మరోవైపు సొంతగడ్డపై ఆడుతుండటం దక్షిణాఫ్రికా( South africa)కు అనుకూలంగా మారనుంది. ఆ జట్టు బ్యాటర్లు రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యారు. దీంతో క్లాసెన్, మార్క్రామ్, స్టబ్స్, మిల్లర్ రాణిస్తే ఎదురుండదు.
भारत और साउथ अफ्रीका के बीच टी-20 सीरीज का तीसरा मैच आज सेंचुरियन में खेला जाएगा। मैच से पहले भारतीय टीम के खिलाड़ियों ने मैदान पर प्रैक्टिस की। #INDvsSA #Cricket #Sports
जानें दोनों टीमों की पॉसिबल प्लेइंग-11- https://t.co/7T1qiTUDBe pic.twitter.com/aR9oucTtFs— Dainik Bhaskar (@DainikBhaskar) November 13, 2024
జట్లు అంచనా
దక్షిణాఫ్రికాXI: రీజా హెండ్రిక్స్, ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్రామ్(C), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, ఆండిల్ సిమెలన్, లూథో సిపమ్లా.
ఇండియా XI: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, వరుణ్ చకరవర్తి.








