Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘పుష్ప-2 : ది రూల్ (Pushpa 2 : The Rule)’. ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్పరాజ్ మేనియానే కనిపిస్తోంది. ఎవరిమాట విన్నా పుష్ప-2 సినిమా గురించే వినబడుతోంది. సినిమా రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. ఇక ప్రీ బుకింగ్స్ సేల్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. టికెట్లు రిలీజ్ చేసిన గంటలోనే హాటు కేకుల్లా అమ్ముడుపోయాయి.
పుష్ప సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో.. పుష్ప-2 అంతకు మించిన సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్సే (Pushpa 2 Collections) ఈజీగా రూ.300 కోట్లు దాటుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు మరే సినిమాకు దక్కని స్థాయిలో ఏకంగా రూ.125 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. ఇక మరికొన్ని గంటల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు ఈ సినిమాకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.
అయితే గత కొంతకాలంగా మెగా (Mega Family), అల్లు ఫ్యామిలీలకు పొసగడం లేదనే పుకారు ఉన్న విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ ల మధ్య స్వల్ప వివాదం తలెత్తింది. పవన్ కల్యాణ్ ను కాదని బన్నీ వైసీపీ నేత ప్రచారానికి వెళ్లడం పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు వచ్చాయని టాలీవుడ్ లో టాక్. దీన్ని బలపరుస్తూ నాగబాబు ట్వీట్ (Nagababu Tweet), ఆ తర్వాత సాయిదుర్గా తేజ్ ఇన్ స్టాలో అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహను అన్ ఫాలో చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా పుష్ప-2 సినిమా గురించి మాట్లాడలేదు. అయితే రిలీజ్ కు ఒక్కరోజు ముందు తాజాగా ఓ మెగా హీరో అల్లు అర్జున్ కు, పుష్ప-2 చిత్రబృందానికి బెస్ట్ విషెస్ చెప్పాడు. అతనెవరో కాదు.. ఇన్ స్టాలో బన్నీని అన్ ఫాలో చేసిన సుప్రీం హీరో సాయిదుర్గా తేజ్ (Sai Dharam Tej Tweet). తాజాగా ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఈ మూవీ టీమ్ కు తన విషెస్ తెలిపారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. అయితే బన్నీ ఈ ట్వీట్‌కి ఏం రిప్లయ్ ఇస్తారా లేదా అని ఇటు మెగా ఫ్యాన్స్.. అటు బన్నీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Wishing all the best to the entire team of #Pushpa2TheRule.
Sending my heartfelt and blockbuster wishes to @alluarjun #Bunny , @aryasukku sir, #FahadhFaasil, @ThisIsDSP , @iamRashmika @resulp @SukumarWritings , @MythriOfficial , and the entire team. pic.twitter.com/VMUb4GLvuu
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 4, 2024






