తెలుగు, తమిళ చిత్రసీమలో తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. సాయిపల్లవి(Sai Pallavi). కేరళలో మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ద్వారా తెరంగేట్రం చేసిన సాయిపల్లవి, తెలుగులో ‘ఫిదా’ చిత్రంలో భానుమతి పాత్రతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ తరువాత ఎంసీఏ, పడి పడి లేచె మనసు, లవ్ స్టోరీ, విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది.
ఇప్పుడు బాలీవుడ్( Bollywood)లో కూడా అడుగుపెట్టింది. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ(Nithin Tivari) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘రామాయణ’(Ramayana)లో ఆమె సీత పాత్రలో నటిస్తోంది. ఇది రెండు భాగాలుగా రూపొందుతోంది. మొత్తం రూ.1600 కోట్ల బడ్జెట్‌తో దేశంలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) రాముడిగా, యష్(Yesh) రావణుడిగా, సాయిపల్లవి సీతగా, సన్నీ డియోల్(Sunny Deol) హనుమంతుడిగా నటిస్తున్నారు. మొదటి భాగానికి రూ.900 కోట్లు, రెండో భాగానికి రూ.700 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.
సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవికి ఏకంగా రూ.12 కోట్ల రెమ్యునరేషన్(Remuneration) ఇవ్వబోతున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇది సాయిపల్లవి కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం. దక్షిణాది చిత్రాల్లో గ్లామర్‌కు బదులు తన నటనా నైపుణ్యంతోనే అభిమానులను సంపాదించుకున్న ఆమెకు బాలీవుడ్ మేకర్స్ భారీ రెమ్యునరేషన్ ఇవ్వడమే కాదు, అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రను కేటాయించటం విశేషం.






