బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్( Junaid Khan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఏక్ దిన్(‘Ek Din’) ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాతో దక్షిణాది స్టార్ హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) బాలీవుడ్(Bollywood )కు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నది. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఇటీవలే చిత్రబృందం ఈ సినిమాను నవంబర్(Navamber) 7న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. జునైద్ ఖాన్ నటనను తొలిసారి చూసేందుకు బాలీవుడ్ ప్రేక్షకులే కాదు, ఆమిర్ ఖాన్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న విషయం ఏమిటంటే.. దీనిని ఆమిర్ ఖాన్(Amir Khan)తో పాటు ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత మన్సూర్ ఖాన్ కలిసి నిర్మిస్తున్నారు. 2008లో వచ్చిన జానే తూ… యా జానే నా తర్వాత వీరిద్దరూ కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.
ఏక్ దిన్ సినిమాతో సాయి పల్లవి మొదటిసారి హిందీ ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఆమె నేచురల్ పెర్ఫార్మెన్స్‌కి ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో డిమాండ్ ఉంది. అందుకే ఈ సినిమా మీద హైప్ భారీగానే ఏర్పడింది.






