Saina Nehwal: మరో స్టార్ కపుల్ డైవర్స్.. మూడుముళ్ల బంధానికి సైనా, కశ్యప్ ముగింపు

భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్(Saina Nehwal) తన భర్త, మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్‌(Parupalli Kashyap)తో విడాకులు(divorce) తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సైనా తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఓ భావోద్వేగ పోస్ట్ ద్వారా వెల్లడించారు. 2018లో వివాహం చేసుకున్న ఈ జంట, ఏడేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు “ఎన్నో ఆలోచనల తర్వాత, నేను, కశ్యప్‌లు విడిపోవాలని నిర్ణయించాము. శాంతి, వృద్ధి, ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాము. మా గోప్యతను గౌరవించాలని కోరుతున్నాము. ధన్యవాదాలు” అని సైనా తన పోస్ట్‌(Post)లో పేర్కొన్నారు.

Just Married: Saina Nehwal ties the knot with Parupalli Kashyap - India  Today

గోపీచంద్ అకాడమీలో మొదలైన స్నేహం

కాగా, సైనా, కశ్యప్‌లు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ(Pullela Gopichand Badminton Academy)లో శిక్షణ తీసుకున్నప్పటి నుంచి సన్నిహితులు. 2004లో డేటింగ్ ప్రారంభించిన వీరు, 2018లో వివాహం చేసుకున్నారు. కశ్యప్ 2016 తర్వాత సైనాకు కోచ్‌గా కూడా వ్యవహరించారు. 2019లో సైనా, పీవీ సింధు(PV Sindhu)ను ఓడించి నేషనల్ ఛాంపియన్‌షిప్ గెలిచినప్పుడు కశ్యప్ సలహాలు కీలకమయ్యాయి.

సైనా 2012 ఒలింపిక్స్‌(Olympics)లో కాంస్య పతకం(Bronze medal), ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించగా, కశ్యప్ 2014 కామన్వెల్త్ గేమ్స్‌(Commonwealth Games)లో స్వర్ణం గెలిచారు. 2024లో కశ్యప్ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్ అయ్యారు, అదే సమయంలో సైనా ఆర్థరైటిస్‌తో సతమతమవుతోంది. ఈ విడాకుల వార్త బ్యాడ్మింటన్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ జంటకు మద్దతుగా సందేశాలు పంపుతున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *