
బాలీవుడ్(Bollywood) స్టార్ సల్మాన్ ఖాన్ (Salman khan) ప్రస్తుతం ‘బాటిల్ ఆఫ్ గల్వాన్(Battle of Galwan)’ చిత్రంలో నటిస్తున్నారు. జూన్ 2020లో లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ(Clash between Indian and Chinese soldiers) ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో సల్మాన్ సైనికుడి(Soldiers) పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ లేహ్‌లో ప్రారంభంకాబోతుంది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ వ్యక్తిగత ట్రైనర్(Trainer)ను నియమించుకొని కఠినమైన ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను అనుసరిస్తున్నారు.
పూర్తిగా మద్యం మానేసిన సల్మాన్
ఇందులో భాగంగానే సల్మాన్ పూర్తిగా మద్యం మానేసినట్లు సమాచారం. అలాగే, జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్లు తగ్గిస్తున్నారు. ‘సికందర్(Sikander)’ సినిమా తరువాత ఆయన శరీరాకృతిపై మరింత శ్రద్ధ చూపుతున్నారు. తన పాత్ర కోసం ఆయన బరువు తగ్గి ఇంకా ఫిట్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక బరువు ఎత్తడంతో పాటు, ఆయన తన జిమ్‌లో ఏర్పాటు చేసిన హై-ప్రెజర్ చాంబర్‌లో కార్డియో చేస్తూ పరుగులు చేస్తున్నారు. ఇది సినిమాకు అవసరమైన ఎత్తైన ప్రాంతాల పరిస్థితులకు ఆయన శరీరం అలవాటు పడేందుకు సహాయపడుతుంది.
ఇక ఈ చిత్రానికి అపూర్వ లఖియా(Directed Apoorva Lakhia) దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో చిత్రాంగదా సింగ్(Chitrangada Singh) కథానాయికగా సల్మాన్‌కి జోడీగా నటిస్తున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ ‘బాటిల్ ఆఫ్ గాల్వాన్’ చిత్రానికి సంబంధించిన తన ఫస్ట్ లుక్(First Look)ను విడుదల చేశారు. అందులో రక్తంతో ముడుచుకున్న ముఖంతో, గుబురు మీసాలతో, చేతిలో వైర్డ్ క్లబ్‌తో కనిపించారు.
Heera Sohal in Battle of Galwan opposite Salman Khan.
Why salman khan promotes only Muslim girls in Bollywood, Katrina Kaif, Zareen Khan, Hina Khan, Dia Mirza, Huma Qureshi, Sana, Sara Khan, Sana Sheikh, Nora Fatehi and now Heera Sohal. #BattleOfGalwan
Think about it guys 🤔 pic.twitter.com/a0yrtq27ah
— 𝐇𝐚𝐛𝐢𝐛𝐢 𝐌𝐚𝐡𝐢 🫂 (@IamRealMahi) July 10, 2025