టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన మకాం ముంబయికి మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లోనే పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. మరోవైపు చెన్నై పికిల్ బాల్ టీమ్ కు ఓనర్ గా కూడా వ్యవహరిస్తూ ఆ టీమ్ కార్యకలాపాలల్లో నిమగ్నమైంది. ఇక తన వృత్తి, వ్యక్తిగత జీవితం గురించి సామ్ తరచూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటుంది.
చై-శోభిత పెళ్లిపై క్వశ్చన్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు తన మాజీ భర్త నాగచైతన్య (Naga Chaitanya) రెండో పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. మరి దానికి సామ్ రియాక్షన్ ఏంటంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు విడాకుల తర్వాత లైఫ్ లో ముందుకు సాగడంపై ప్రశ్న ఎదురవ్వగా.. అందులో నుంచి బయటకు వచ్చేందుకు ఎంతో శ్రమించానని చెప్పుకొచ్చింది సామ్. తన మాజీ భాగస్వామి (నాగచైతన్య) కొత్త బంధంలోకి అడుగుపెట్టడంపై ప్రశ్న ఎదురవ్వడంతో తొలిసారి ఈ విషయంపై సమంత స్పందించింది.
నా లైఫ్ లో దానికి చోటు లేదు
‘‘మాజీ భాగస్వామి కొత్త బంధంలోకి అడుగుపెట్టినందుకు మీరు ఏమైనా అసూయ పడుతున్నారా?’’ అని ప్రశ్నించగా.. ‘‘ నా జీవితంలో అసూయకు తావులేదు. నా జీవితంలో అది భాగం కావడాన్ని కూడా అంగీకరించను. అసూయే అన్ని చెడులకు మూలమని భావిస్తాను’’ అంటూ తొలిసారి ఈ విషయంపై సామ్ మాట్లాడింది. అలాంటి వాటి గురించి తాను పెద్దగా ఆలోచించనని చెప్పుకొచ్చింది.






