టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha).. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా మారింది. ఇక ముంబయి వెళ్లిన తర్వాత ఈ భామ తన స్టైల్ మార్చేసింది. ఎప్పటికప్పుడు అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఇక తాజాగా ఈ భామ ఏకంగా హాలీవుడ్ మేకోవర్ లో కనిపించి అందర్నీ సర్ ప్రైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
బాబ్ కట్ లో సామ్ కొత్త లుక్
సామ్ (Samantha Latest Photos) లేటెస్ట్ ఫొటోల్లో బ్లాక్ కలర్ సూట్ లో కనిపించింది. ఇక డిఫరెంట్ హెయిర్ కలర్ తో హాలీవుడ్ హీరోయిన్ లా ఉంది. ఇందులో సమంత షార్ట్ హెయిర్‌తో బాబ్ కట్ చేయించుకుని కనిపించింది. జుట్టు మొత్తాన్ని ఒకే సైడ్‌కు పెట్టి ఫొటోకు పోజులిచ్చింది. ఈ పిక్స్ చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోల్లో కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో సమంత కిక్కెక్కించింది.
Samantha ‘s Transformation 🔥🔥 pic.twitter.com/BTl6fuqZLD
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) February 4, 2025
మాకు మళ్లీ జెస్సీ కావాలి
ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరికొందరేమో అయ్యో సామ్.. నీకేమైంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరేమో మాకు ఏం మాయచేసావే సమయంలో ఉన్న (జెస్సీ) సామ్ కావాలంటున్నారు. సమంత సినిమాల సంగతికి వస్తే.. ఇటీవలే ‘సిటాడెల్ : హనీ బన్నీ (Citadel : Honey Bunny)’ అనే వెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది. ఇక తాజాగా ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే సిరీస్ లో నటిస్తోంది.






