నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా, బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘అఖండ 2: తాండవం(Akhanda 2: Tandavam)’. ఈ సినిమాకు సంబంధించి తాజా వార్తలు సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. మొదటి భాగం ‘అఖండ(Akhanda)’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన నేపథ్యంలో, సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా, ఈ చిత్రంలో ఐటెం సాంగ్(Item song)కు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంయుక్తా మీనన్(Samyukta Menon) ఈ ఐటెం సాంగ్‌లో కూడా సందడి చేయనున్నట్లు సమాచారం.

బాలయ్య యాక్షన్.. సంయుక్త గ్లామర్
సంయుక్తా మీనన్(Samyukta Menon), తన అందం, నటనతో టాలీవుడ్(Tollywood)లో మంచి గుర్తింపు పొందిన నటి. ‘అఖండ 2’లో ఆమె ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, ఈ ఐటెం సాంగ్‌లో ఆమె గ్లామరస్ అవతార్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్(DSP) సంగీతం అందిస్తున్నారని, బోయపాటి శ్రీను మార్క్ మాస్ బీట్‌తో ఈ సాంగ్‌ను గ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నారని సమాచారం. సినిమా కథలో ఈ పాట సోషియో-ఫాంటసీ ఎలిమెంట్స్(Socio-fantasy elements)తో ముడిపడి ఉంటుందని, బాలయ్య యాక్షన్‌తో పాటు సంయుక్త గ్లామర్ ఈ సాంగ్‌కు హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.

విడుదల తేదీ మారిందా?
ఈ చిత్రం 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట(Ram Achanta) , గోపీచంద్ ఆచంట(Gopichand Achanta) నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి(Aadi Pinisetty) విలన్‌గా, హర్షాలీ మల్హోత్రా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న దసరా కానుకగా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ తాజాగా విడుదల తేదీ(Release Date)ని మార్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ ఐటెం సాంగ్ సినిమాకు మరింత ఆకర్షణగా నిలవనుంది.
#Akhanda2 – Postponed!
The film is looking at a New Date in December and is likely to arrive in the 1st Half of December just like #Akhanda! pic.twitter.com/n6XcuvLOiK
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) July 16, 2025






