జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan) వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. భాషలతో సంబంధం లేకుండా పలు సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. తన పాత్ర బలంగా ఉందనిపిస్తే హీరో క్యారెక్టరే కాకుండా ఎలాంటి పాత్రలకైనా ఓకే చెప్పేస్తున్నాడు. ఈ యంగ్ హీరో నుంచి ఇటీవల వచ్చిన సినిమా ‘మజాకా (Mazaka)’. రీతూ వర్మ హీరోయిన్గా త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని తెరక్కించారు.
ఉగాది పర్వదినాన నవ్వుల పువ్వులు
ఫిబ్రవరి 26వ తేదీన రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాజిటివ్ టాక్ తో పసందైన కామెడీతో ఆడియెన్స్ ను ఫిదా చేసింది. థియేటర్లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా మార్చి 28వ తేదీన ఓటీటీలోకి రానుంది. జీ5 (Mazaka Zee5) వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో రావు రమేశ్, అన్షు ప్రధాన పాత్రలు పోషించారు.
ఓటీటీలోకి మజాకా సినిమా
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో అజయ్, మురళీ శర్మ (Murali Sharma), హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, సుప్రీత్ రెడ్డి, గగన్ విహారి కీలక పాత్రలు పోషించారు. హాస్య ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని రాజేష్ దండ నిర్మించారు. తండ్రీకొడుకులుగా సందీప్ కిషన్ , రావు రమేష్ పర్ఫామెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మన్మథుడు ఫేం అన్షు ఈ చిత్రంతో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ ఉగాది పండుగ పూట మీ కుటుంబంతో కలిసి జాలీగా సినిమా చూస్తే నవ్వుకోండి.






