భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) గురించి తెలియని వారుండరు. ఈమె తన ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక తన పర్సనల్ లైఫ్ లోనూ సానియా భర్తతో విడాకులు తీసుకుంది. ఇక ఈమె ఎప్పుడెప్పుడు తన లైఫ్ లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఆమె అభిమానులు. ఇక ఆ తరుణం వచ్చేసింది. నా జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించాను అంటూ ఆమె చేసిన ఓ ప్రకటన ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అయితే సానియా తన పర్సనల్ లైఫ్ గురించి ఈ ప్రకటన చేసిందని అంతా భావించారు.
అయ్యో సానియా..
ఆమె తన కాబోయే వరుడిని పరిచయం చేస్తుందని, పెళ్లి కబురు (Sania Mirza) చెబుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సానియా తన ప్రొఫెషనల్ లైఫ్ లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేసినట్లు తాజాగా ప్రకటించింది. చిన్నారుల ఫిట్‌నెస్, చదువు కోసం వినూత్న రీతితో ఏడాది క్రితం జూబ్లీహిల్స్‌లో సీసా స్పేసెస్ ( See Saw Spaces) అనే సంస్థ ఏర్పాటైంది. ఇప్పుడు ఈ సంస్థతో కలిసి ఈ ఏడాది కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని సీసా స్పేసెస్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ భాగస్వాములైన నటుడు చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల, స్వాతి గునుపాటితో కలిసి ఈ ప్రకటన చేసింది సానియా.
చిన్నారుల కోసం ఓ ముందడుగు
“ఇప్పుడున్న చాలా మంది పిల్లలు మొబైల్ ఫోన్లు, ట్యాబ్ లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. వారికి అన్నం తినిపించాలంటే తల్లిదండ్రులు చుక్కులు చూడాల్సి వస్తోంది. ఓ తల్లిగా నాకు ఈ సమస్య గురించి తెలుసు. పిల్లలు మొబైల్ ఫోన్లకు అలవాటు అయితే వారు పెరుగుతున్న కొద్దీ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్నారులకు చదువు ఒక్కటే లోకం కాదు. అలాగని స్మార్ట్ ఫోన్ వినియోగమూ మంచిది కాదు. వారు హ్యాపీగా, ఆరోగ్యంగా పెరిగేందుకు అనుకూలమైన వాతావరణాన్ని పేరెంట్స్ క్రియేట్ చేయాలి. వారికి ఫిట్ నెస్, మంచి ఆహారం చాలా అవసరం. ఈ అంశాల్లో సీసాతో కలిసి నేను పని చేయనున్నాను.” అని సానియా మీర్జా చెప్పుకొచ్చింది.








