Mana Enadu: వచ్చే ఐపీఎల్(IPL-2025) సీజన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్(Retention) ప్రక్రియ ముగిసింది. అన్ని జట్లు తమకు అవసరమున్న ప్లేయర్లను అట్టిపెట్టుకొని మిగతా వారిని మెగా వేలాని(Mega auction)కి వదిలేశాయి. ఇదిలా ఉండగా లక్నో సూపర్‌జెయింట్స్(Lucknow Super Giants) కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul)ను ఆక్షన్‌కు వదలిలేయడంపై పెద్దయెత్తున చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా(Sanjiv Goenka) రాహుల్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేఎల్ రాహుల్ స్వార్థ పరుడని, ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు. అయితే, కేఎల్ రాహుల్ పేరును ప్రస్తావించకుండా సంజీవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో దుమారం రేపుతున్నాయి.
ఆ ఘటన ఇంకా ట్రెండింగ్‌లోనే
కాగా IPL 2024లో రాహుల్ మర్చిపోలేని ఓ ఘటన చోటు చేసుకుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను (KL Rahul) LSG ఓనర్ సంజీవ్ గోయెంకా ఒకానొక సంఘటనలో క్లాస్ ఇస్తున్న వీడియోలు, ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పటికీ వైరల్(Viral) అవుతూనే ఉన్నాయి. అయితే ఆ సమయంలోనే రాహుల్ లక్నోను వదిలివేయాలని నిర్ణయం తీసుకున్నాడని అనేక రకాలుగా వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత వారిద్దరూ మళ్లీ కలవడం, సంజీవ్ రాహుల్ కౌగిలించుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.
ఆ ఐదుగురికి భారీ ధర
అయితే IPL వేలానికి ముందుగానే కేఎల్ బయటికి వెళ్లిపోతున్నట్టు చెప్పినట్లుగా జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా LSG ప్రకటించిన రిటెన్షన్ లిస్ట్‌లో రాహుల్ పేరు లేదు. అతడికి బ్యాకప్ కెప్టెన్‌గా పనిచేస్తున్న నికోలస్ పూరన్(Nicholas Pooran)ని రూ.21 కోట్లకు రిటైన్ చేసేకుందా జట్టు. స్పిన్నర్ రవి బిష్నోయ్, మయాంక్ యాదవ్‌లను రూ. 11 కోట్లకు అట్టిపెట్టుకుంది. అన్ క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో మోసిన్ ఖాన్, ఆయుష్ బదోనీలను రూ.4 కోట్లకు రిటైన్ చేసుకుంది.








