ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జట్టు కెప్టెన్ సంజు శాంసన్(Sanju Samson) ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనను జట్టు నుంచి రిలీజ్ చేయాలని లేదా మరో జట్టుకు బదిలీ (Trade) చేయాలని అతడు యాజమాన్యానికి అధికారికంగా విజ్ఞప్తి చేసినట్లు జాతీయ మీడియా (National Media)లో వార్తలు వస్తున్నాయి. ఈ వార్త IPL వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే కొంతకాలంగా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యానికి, సంజు శాంసన్‌కు మధ్య విభేదాలు(Differences) తలెత్తాయని, ఈ విషయాన్ని సంజు కుటుంబ సభ్యులతో పాటు అతడికి సన్నిహితంగా ఉండే కొందరు క్రికెటర్లు సైతం ప్రస్తావించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
2021 నుంచి RRకు కెప్టెన్‌గా సంజూ
“సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌తో కొనసాగాలని అనుకోవడం లేదు. అందుకే తనను రిలీజ్ చేయాలని కోరాడు” అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2021 నుంచి RRకు సంజు కెప్టెన్(Captain)గా వ్యవహరిస్తున్నాడు. గత మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీ అతడిని ఏకంగా రూ.18 కోట్లకు రిటైన్(Retain) చేసుకుని తమ కీలక ఆటగాడిగా ప్రకటించుకుంది. అలాంటి ఆటగాడు ఇప్పుడు జట్టును వీడాలనుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, సంజు శాంసన్‌ను తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
Sanju Samson has decided to leave Rajasthan Royals, which could lead to a big trade deal or a high-profile auction in the 2026 IPL.#SanjuSamson #IPL2026
[Times Now report ] pic.twitter.com/XG6IpLxu6L
— Vivek Kumar Mishra🇮🇳 (@vivek23mishra) August 8, 2025






