Mana Enadu : ‘హే గొబ్బియల్లో గొబ్బియల్లో.. పండగొచ్చే గొబ్బియల్లో…. ఎవ్రిబాడీ గొబ్బియల్లో.. సింగ్ దిస్ మెలోడీ గొబ్బియల్లో…. పెద్ద పండగండి గొబ్బియల్లో.. లెట్స్ గెట్ ట్రెండీ గొబ్బియల్లో…. కమ్ ఆన్’ అంటూ పాట పాడుతూ విక్టరీ వెంకటేశ్ ఈ సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల్లో జోష్ నింపుతున్నారు. ఆయన గాత్రం అందించిన బ్లాక్ బస్టర్ పొంగల్ అనే పాట ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా 2025 జనవరి 14వ తేదీన విడుదల కానుంది.
హ్యాట్రిక్ కోసం ట్రై
“ఎఫ్2”, “ఎఫ్3” వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వెంకటేశ్ (Venkatesh) – అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబో హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ సంక్రాంతికి వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన “గోదారి గట్టు” పాట సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ‘బ్లాక్ బస్టర్ పొంగల్ (Block Buster Pongal)’ అంటూ మరో లిరికల్ సాంగ్ విడుదలైంది. బీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ పాటను వెంకటేశ్ పాడారు.
జనవరి 14న రిలీజ్
“హే కోకోరికో కోడి కూడా జనవరి సలిపులి దెబ్బకి.. ఎంతలేసి ఒనికిందో ఏ మూల పండుకుందో.. రథం ముగ్గు వేసుకుంటా ఏడుకూరి నాగలచ్చిమి.. ఎంత దూరమెల్లిందో ఎటు పోయిందో”.. అంటూ సాగిన పాట ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో వెంకటేశ్ సరసన ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి (Meenakshi CHowdary) నటించారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు సమర్పిస్తుండగా శిరీష్ నిర్మిస్తున్నారు.






