Mana Enadu : విక్టరీ వెంకటేశ్ (Venkatesh), అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టేందుకు మరోసారి జత కడుతోంది. ఈసారి ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam)’ అనే టైటిల్ తో సంక్రాంతి పండుగకు ఈ కాంబో థియేటర్లలో ఫన్ పంచేందుకు వచ్చేస్తోంది. 2025 జనవరి 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
18 ఏళ్ల తర్వాత రమణ గోగుల సాంగ్
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మేకర్స్ తరచూ ఓ అప్డేట్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ‘గోదారి గట్టు మీద రామ చిలకవే(Godari Gattu Lyrical Song)’ అంటూ సాగే ఈ పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఒకప్పటి మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ రమణ గోగుల (Ramana Gogula) ఈ పాటను ఆలపించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఆయణ్నుంచి ఈ పాట రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇదే బెస్ట్ సాంగ్
ప్రముఖ రచయిత భాస్కర భట్ల (Bhaskar Bhatla) ఈ పాటను రచించారు. ఈ సాంగ్ క్యాచీ లిరిక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రమణ గోగుల హస్కీ వాయిస్ ఈ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. తెలంగాణ ఫోక్ సింగర్ మధుప్రియ రమణ గోగులతో కలిసి ఈ పాట పాడారు. ఈ సాంగ్లో వెంకీ, ఐశ్వర్య రాజేశ్ తమదైన డ్యాన్స్ స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు.
అది నా ఫేవరెట్ సాంగ్
ఈ పాట ఈ మూవీ ఆల్బమ్లోనే తన ఫేవరెట్ అని దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ట్వీట్ చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకుల చేత థియేటర్లలో డ్యాన్స్ చేయిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా సంగతికి వస్తే.. ఈ చిత్రాన్ని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వెంకటేశ్ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.






