Sankranti: సంక్రాంతికి సందడే సందడి.. రిలీజ్‌కు రెడీగా పెద్ద సినిమాలు

 ‘సంక్రాతి(Sankranti)’ అంటేనే ఫుల్ సందడి.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి అతిపెద్ద ఫెస్టివల్(Cine Festival). ఎందుకంటే పొంగల్‌కి డజన్ల కొద్దీ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిస్తే.. మరికొన్ని డిజార్టర్‌ను చవిచూస్తాయి. ఇక ఈ ఏడాదికి డిసెంబర్ ఒక నెల మాత్రమే ఉండటంతో కొత్త సంవత్సరంపై సినిమా పరిశ్రమ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అందులోనూ స్టార్ హీరోలు సైతం పొంగల్‌కి అభిమానులను పలకరించేందుకు రెడీ అయిపోయారు.

 బాలయ్యను చెర్రీ అడ్డుకుంటాడా?

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్‌ నుంచి బిగ్ ఫైట్ తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Mega power star Ram Charan), మ్యాన్ ఆఫ్ మాసెస్, నందమూరి సీనియర్ హీరో బాలయ్యబాబు(Nandamuri Balakrishna), వెటరన్ స్టార్ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌(Victory Venkatesh) పోటీ పడబోతున్నారు. ఈ మేరకు జనవరి 10న చెర్రీ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ విడుదల కానుంది. ఇక అదే నెల 12వ తేదీన బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ రిలీజ్ అవనుంది. అలాగే 14న విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూడు సినిమాలతో పాటు సందీప్ కిషన్(Sandep Kishan) నటించిన ‘మజాకా’, తమిళ నటుడు అజిత్(Ajith) నటించిన ‘విడముయాచి’ సినిమా సైతం సంక్రాంతి రేసులో ఉంది. దీంతో వచ్చే సంక్రాంతికి థియేటర్లలో బిగ్ క్లాష్ తప్పదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

పెద్ద హీరోలతో తలపడనున్న ‘కంగనా’

ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut) నటించిన ‘ఎమర్టెన్సీ(Emergency)’ కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఇందిరాగాంధీ సమయంలో విధించిన ఎమర్జెన్సీపై కంగన సినిమా నిర్మించింది. ఇందులో కంగనానే ఇందిరాగాంధీ పాత్ర పోషించడమే కాకుండా, ఆమె ఈ సినిమాని నిర్మాతగా, దర్శకురాలిగా తెరకెక్కించింది. ఈ సినిమా ఎప్పుడో పూర్తయినా సెన్సార్ ఇబ్బందులు, ఎన్నికల వల్ల, పలు కారణాలతో ఇప్పటికే పలుమార్లు వాయిదాపడింది. ఎమర్జెన్సీ సినిమా 2025 జనవరి 17న రిలీజ్ కానున్నట్టు కంగనా ప్రకటించింది. మరి వచ్చే సంక్రాంతికి హిట్టు కొట్టేది ఎవరో తెలియాలంటే మరో నెలరోజులు ఆగాల్సిందే.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *