Mana Enadu: భారతదేశంలో చీర(Saree) ధరించడం అనాదిగా వస్తోన్న ఆచారం. అంతేకాకుండా చీర అనేది భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలకు సంకేతం. కాలం మారినా, మహిళలు చీరలంటే ఇష్టపడుతూనే ఉన్నారు. పల్లెటూరు నుంచి బాలీవుడ్(Bollywood) వరకు చీరలు కట్టే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
అయితే, చీర ధరించడం వల్ల మహిళల్లో క్యాన్సర్(Saree Cancer) వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయనే విషయం మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కదా? చాలామందికి ఇది అసంభవంగా అనిపిస్తుంది. అయితే, దీనిపై నిపుణులు చెబుతున్నదేంటంటే..?
ఈ లక్షణాలను పట్టించుకోకపోతే అంతే
ప్రతి ప్రాంతంలో మహిళలు చీరను ప్రధానంగా ధరిస్తారు. అయితే చీర కట్టుకునే ముందు లోపల లంగా కట్టుకుని ఆ పైన చీర కట్టుకుంటారు. అయితే లంగా బందుతో గట్టిగా చుట్టి కట్టుకోవడం వల్ల కొన్ని ఏళ్ల తర్వాత ఆ భాగంలో చర్మం నల్లగా మారి ఊడిపోతుంది. అక్కడ దురద(itching) కూడా మొదలవుతుంది. ఇక ఈ లక్షణాలను పట్టించుకోకపోతే అది స్కిన్ కాన్సర్(Skin cancer)గా మారే అవకాశం ఉందని ఆంకాలజిస్ట్(Oncologists)లు చెబుతున్నారు.
ఒక్క చీర విషయంలోనే కాదు ఎవరైతే బిగుతుగా ఉండే బట్టలు ధరిస్తారో వారిలోనూ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్యాన్సర్‌ను వైద్య పరిభాషలో స్క్వామస్ సెల్ కార్సినోమా(Squamous cell carcinoma) అంటారని చెబుతున్నారు. ఈ క్యాన్సర్ వ్యాప్తికి ముఖ్యంగా అపరిశుభ్రంగా ఉండటమే కారణమని హెచ్చరిస్తున్నారు.
నిపుణులు ఏమంటున్నారంటే..?
చీరతో ధరించే పెటికోట్ తీగను పొడి వాతావరణంలో గట్టిగా బిగిస్తే, దుమ్ము, చెమట పేరుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. వీటిని విస్మరిస్తే, కొన్ని అరుదైన కేసుల్లో దీన్ని ‘పెట్టికోట్ క్యాన్సర్(Petticoat cancer)’గా పిలుస్తారు. ఇది ముఖ్యంగా నడుము ప్రాంతంలో కనిపిస్తుంది. స్త్రీలు దుస్తులు మరీ బిగుతుగా కట్టుకుంటే ఈ సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
☛ చర్మం మీద స్కాబ్స్ లేదా రంగు మార్పులు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
☛ సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి. పెటికోట్ కాకుండా గాలి సరిగా వెళ్లే ప్యాంట్లు ఇంట్లో ధరిస్తే మంచిది.
☛ బెల్ట్ లేదా తాడు వాడకంలో జాగ్రత్త పాటిస్తే మేలు. ఇది గట్టి ఒత్తిడి కలిగించేలా ఉండకూడదు.
☛ అనుకోని చర్మ సమస్యలు ఉంటే త్వరగా వైద్య సలహా తీసుకోవాలి.
☛ చీర ధరించడం ద్వారా అనుకోని ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ సూచనలు పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.