SBI Clerk Jobs 2024 : 13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లే చేసుకోండి

Mana Enadu : దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State Bank of India) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 13,735 క్లర్క్‌ (SBI Clerk Notification) ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబరు 17వ (మంగళవారం) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. జనవరి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే వారు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/ తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలని పేర్కొంది.

ఎస్బీఐ క్లర్క్ పోస్టు అర్హతలు

ఈ జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులకు డిగ్రీ ఫైనల్‌/ చివరి సెమిస్టర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్బీఐ (https://sbi.co.in/) తన వెబ్ సైట్లో పొందుపరిచింది. 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులను తెలిపింది. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుందని పేర్కొంది.

SBI జూనియర్‌ అసోసియేట్‌ క్లర్క్‌ నోటిఫికేషన్‌ 2024 వివరాలు ఇవే..

  • పోస్టులు : క్లర్క్ (జూనియర్‌ అసోసియేట్‌)
  • పోస్టుల సంఖ్య – 13,735 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ – 50, తెలంగాణ – 342)
  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌
  • దరఖాస్తు గడువు : 2024 డిసెంబర్ 17 టు 2025 జనవరి 7
  • అర్హత : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి
  • వయో పరిమితి : 20 – 28 ఏళ్ల మద్య ఉండాలి
  • ఎంపిక విధానం : ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్ష, స్థానిక భాష మీద పరీక్ష ఆధారంగా ఎంపిక

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *