జమ్మూకశ్మీర్‌లో సెర్చ్ ఆపరేషన్.. ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌(Pahalgam Terror Attack)లో జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత భారత్ అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుని ఉగ్రవాదుల(Terrorists) బేస్ క్యాంపులే లక్ష్యంగా పాకిస్థాన్‌లో దాడులు చేసింది. అలాగే ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకూ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు ఉగ్రవేటను ముమ్మరం చేశారు. తాజాగా జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌(Search operation)లో ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్నారు.

ఉగ్రవాద కార్యకలాపాలపై ఆరా..

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో చేపట్టిన ఆపరేషన్‌లో ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ (Two terrorists arrested) చేశారు. ఈ సెర్చ్ ఆపరేషన్ డీకే పోరా ప్రాంతంలో జరిగింది. వారి వద్ద రెండు పిస్టల్స్, నాలుగు గ్రనేడ్‌లు, 43 లైవ్ రౌండ్లు, ఇతర ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రశ్నిస్తున్నారు. అలాగే షోపియాన్ (Shopian) ప్రాంతంలో భారీ ఎత్తున ఈ సెర్చ్ ఆపరేషన్ (Search operation) కొనసాగిస్తున్నారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *