Godavari River: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

తెలంగాణలోని భద్రాచలం(Bhadrachalam) వద్ద గోదావరి నది(Godavari River) ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం రాత్రి 9 గంటల సమయానికి గోదావరి నీటి మట్టం 48 అడుగులపైకి చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ(Issue of second hazard warning) చేశారు. 53 అడుగులకు చేరుకోగానే చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మరోవైపు గోదావరి నీటిమట్టం పెరగడంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం, చింతూరు, వీఆర్ పురం, కూనవరం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాల(For flood zones)కు వెళ్లే ప్రధాన రహదారి మురుమూరు గ్రామం వద్ద వరద నీరు చేరడంతో చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో కల్యాణ కట్ట వరకు వరద నీరు చేరింది. పట్టణంలోకి వరద నీరు రాకుండా అధికారులు కరకట్టకు ఉన్న స్లూయిజ్‌(Sluice)లను మూసివేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *