
నేచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్(The Paradise)’ నుంచి రెండో పోస్టర్(Second Poster) విడుదలై, సోషల్ మీడియా(SM)లో వైరల్‌గా మారింది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని ‘జడల్(Jadal)’ అనే పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. పోస్టర్‌లో నాని రెండు జడలతో, గడ్డంతో, తుపాకీ పట్టుకుని రఫ్ అండ్ టఫ్ లుక్‌లో ఆకట్టుకున్నారు. “(His Game)వాడి తీరు. నేను ఒక్క అంగుళం కదలను. యుద్ధం నా వద్దకు రాబోతుంది” అని నాని తన ఎక్స్(X)లో పోస్టర్ షేర్ చేస్తూ రాశారు.
His game/ వాడి తీరు
I ain’t moving an inch. Bring the war to me. Waiting..#THEPARADISE @odela_srikanth @anirudhofficial @Dop_Sai @NavinNooli @artkolla @kabilanchelliah @SLVCinemasOffl pic.twitter.com/2Z0FJjhjj6
— Nani (@NameisNani) August 8, 2025
రూ. 100 కోట్ల బడ్జెట్‌తో..
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా, “నా జడల్. ప్రపంచం వ్యతిరేకంగా ఉన్నా, వాడు ఒంటరిగా ఎదుర్కొంటాడు” అని పేర్కొన్నారు.ఈ సినిమా 1980-90 హైదరాబాద్ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఎస్ఎల్‌వీ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) నిర్మిస్తున్న ఈ చిత్రం రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం, జీకే విష్ణు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి బలం. రాఘవ్ జుయల్ విలన్‌గా నటిస్తున్నారు.
కాగా ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ పర్యవేక్షణలో విదేశీ స్టంట్ మాస్టర్లతో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ పోస్టర్(Poster) సినిమాపై అంచనాలను మరింత పెంచింది.