బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో (Border Gavaskar Trophy) భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు (2nd Test )మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 180 రన్స్ చేసి స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యింది. (India vs Australia) మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో చెలరేగి భారత బ్యాటర్లను దెబ్బకొట్టాడు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (42) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేసినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.
నిరాశపర్చిన రోహిత్, కోహ్లీ
ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీమిండియాకు స్టార్క్ షాకిచ్చాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను డకౌట్ చేశాడు. విరాట్ కోహ్లీని (Virat Kohli) కూడా అతడే 7 పెవిలియన్ చేర్చాడు. ఇక ఓపెనర్‌గా కాకుండా ఆరో స్థానంలో వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 3 రన్స్ మాత్రమే చేసి బోలాండ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. రిషభ్ పంత్ (21), అశ్విన్ (22) స్వల్ప స్కోర్లు చేసి ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 6 వికెట్లు పడగొట్టగా.. ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో 2 వికెట్లు తీశాడు.
ఇదీ స్కోరు కార్డ్
యశస్వి జైస్వాల్ (0), కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31), విరాట్ కోహ్లీ (7), రిషభ్ పంత్ (21), రోహిత్ శర్మ (3), నితీశ్ కుమార్ రెడ్డి (42), అశ్విన్ (22), హర్షిత్ రాణా(0), జస్ప్రీత్ బుమ్రా(0), మహమ్మద్ సిరాజ్(4 నాటౌట్)








