ప్రముఖ నటుడు జయం రవి(Jayam Ravi) కుటుంబంలో నెలకొన్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. ఇప్పటికే ఆయన భార్య ఆర్తి(Arthi)తో విడాకుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా, తాజాగా ఆయన అత్త, సినీ నిర్మాత సుజాత విజయ్‌కుమార్(Producer Sujatha Vijaykumar) తీవ్ర ఆరోపణలతో ఒక ప్రకటన విడుదల చేశారు. జయం రవి ప్రవర్తన వల్లే తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందులు(Financial difficulties) ఎదుర్కొన్నానని, ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రవి ప్రోత్సాహంతోనే సినీ నిర్మాణ రంగంలోకి..
జయం రవి ప్రోత్సాహంతోనే తాను సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టానని సుజాత విజయ్‌కుమార్(Sujatha Vijaykumar) వెల్లడించారు. తన అల్లుడిని కొడుకులా భావించానని, ఆయన హీరోగా ‘అడంగ మరు’, ‘భూమి’, ‘సైరన్’ వంటి చిత్రాలను నిర్మించానని పేర్కొన్నారు. ఈ సినిమాల నిర్మాణం కోసం ఫైనాన్షియర్ల నుంచి సుమారు రూ.100 కోట్లు అప్పు తీసుకున్నానని, అందులో 25% జయం రవికే పారితోషికం(Remunaration)గా ఇచ్చానని ఆమె వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు.
Jayam Ravi’s mother-in-law Sujatha Vijayakumar slams actor for calling her ‘family breaker’, spreading false allegationshttps://t.co/G8r2skhYsj
— HT Entertainment (@htshowbiz) May 17, 2025
అమ్మ అని ప్రేమగా పిలిచేవాడు.. కానీ,
“అప్పుల కారణంగా నేను ప్రశాంతత లేని జీవితాన్ని గడిపాను. వడ్డీలు నేనొక్కదాన్నే చెల్లించేదాన్ని. నష్టాలను పూడ్చడానికి నా బ్యానర్‌లోనే మరో సినిమా చేస్తానని ‘సైరన్’ సమయంలో అతడు మాటిచ్చాడు. కానీ, ఏ చిత్రానికీ సంతకం చేయలేదు. అంతేకాకుండా, అప్పులు తీర్చడానికి సాయం చేస్తానని కూడా చెప్పలేదు” అని సుజాత తన ప్రకటనలో ఆరోపించారు. జయం రవి తనను ‘అమ్మ’ అని ప్రేమగా పిలిచేవాడని, కానీ ఇప్పుడు సానుభూతి కోసం అతడు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే బాధగా ఉందని, హీరో అనే భావన పోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.






