
వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త ఐటీపన్ను విధానాలు తీసుకురావాలని చాలా మంది ట్యాక్స్ పేయర్లు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. వచ్చే వారం పార్లమెంట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ (Separate personal income tax) బిల్లు ప్రవేశపెట్టునున్నట్లు తెలిపారు. ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఇన్‌కమ్ ట్యాక్స్(income tax))లో అనవసరపు సెక్షన్లను తొలగిస్తామని తెలిపారు. మరోవైపు పట్టణాల్లో ఆదాయ వృద్ధి, పేదరిక నిర్మూలన(Income growth and poverty alleviation)పై దృష్టి పెట్టినట్లుగా నిర్మల తెలిపారు. ఈ క్రమంలోనే పట్టణ పేదల కోసం రూ.30 వేల పరిమితితో UPI లింక్డ్ క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే కస్టమ్స్ చట్టంలో మార్పులు, 7 రకాల సుంకాలను తొలగిస్తామని చెప్పారు.
కొత్తగా 5 ఐఐటీల ఏర్పాటు
దేశంలో వైద్యవిద్య(medical education)ను మరింత బలోపేతం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రానున్న కాలంలో మెడికల్ కాలేజీ(Medical Colleges)ల్లో అదనంగా 10 వేల సీట్లను పెంచనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఐదేండ్లలో 75వేలకు పైగా సీట్ల జోడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. కొత్తగా IITలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్యం 100% శాతానికిపైగా పెరిగిందని చెప్పారు. కొత్తగా 5 ఐఐటీలను ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా మరో 6500 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ని వినియోగిస్తామని చెప్పారు.