తెలంగాణలో పోలీస్ అధికారులకు పోలీస్ శాఖ స్థానభ్రంశం కల్పించింది ఈ మేరకు సోమవారం సాయంత్రం తెలంగాణ పోలీస్‌శాఖ(Telangana Police Department) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. మొత్తం 77 మందిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్(DGP Jitender) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జగిత్యాల DSPగా వెంకటస్వామి, బాలానగర్ ACPగా నరేశ్ రెడ్డి, శంషాబాద్ ACPగా శ్రీకాంత్ గౌడ్, మాదాపూర్ ACPగా సీహెచ్ శ్రీధర్‌ను నియమించింది.
![]()
అలాగే చిక్కడపల్లి ACPగా శ్రీకాంత్, మేడ్చల్ ACPగా శంకర్ రెడ్డి, సంతోష్ నగర్ ACPగా సుఖ్‌దేవ్‌సింగ్, హుజూరాబాద్ DSPగా మాధవి, కామారెడ్డి DSPగా శ్రీనివాసరావు, పటాన్ చెరు ACPగా ప్రభాకర్, సిద్దిపేట ACPగా రవీందర్ రెడ్డి, కూకట్‌పల్లి ACPగా రవికిరణ్ రెడ్డి, పేట్‌బషీర్‌బాద్ ACPగా బాలగంగిరెడ్డి, మహేశ్వరం ACPగా జానకిరెడ్డి, షాద్‌నగర్ ACPగా లక్ష్మినారాయణ సహా మొత్తం 77 మందిని DGP బదిలీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్నారు.






