ManaEnadu: నార్మల్‌గానే సెలబ్రిటీలు చిన్న చిన్న బ్రాండ్స్ వాడరు. అన్ని బ్రాండెడ్(Branded Items) వస్తువులనే ఎక్కువగా వాడుతుంటారు. క్రీడాకారుల నుంచి స్టార్ హీరోలందరూ దాదాపు ఇదే ట్రెండ్(Trend) కొనసాగిస్తుంటారు. కాస్ట్లీ వాచ్‌లు, కార్లు, ట్రెండీ గార్మెంట్స్ ఉపయోగిస్తుంటారు. తాజా బాలీవుడ్ బాద్ షా, స్టార్ యాక్టర్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) తన చేతికి పెట్టుకున్న ఓ వాచ్(Watch) సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇలా తన వద్ద ఇలాంటి వాచ్ ఒకటి డజన్ల కొద్దీ ఉన్నాయట. ఇంతకీ అదేం వాచీ.. దాని ధరెంత అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా..
చిన్నపాటి సినిమానే తీయొచ్చు: ఫ్యాన్స్
షారుఖ్‌ఖాన్(Shah Rukh Khan) ధరించిన ఈ వాచ్ ధర దాదాపు 4.7 కోట్లు ఉంటుందని సమాచారం. అడెమర్స్ పిగెట్(AUDEMARSPIGUET) అనే బ్రాండ్‌కు చెందిన వాచ్ ఇదని తెలిపింది. రాయల్ ఓక్(ROYAL OAK PERPETUAL) అనే మోడల్‌కు చెందిన ఈ వాచ్ ధర 4. 7 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది. ఈ వాచ్ ధర సోషల్ మీడియా(Social Media)లో హాట్ టాపిక్‌గా మారింది. IIFA 2024 అవార్డ్స్‌లోనూ అదే కంపెనీకి చెందిన రూ.4.6 కోట్ల విలువైన మరో వాచ్‌తో ఆయన కనిపించారు. ఈ వాచ్ ధరతో జీవితాంతం లగ్జరీగా బతకవచ్చని, ఈ వాచ్ కొనే ధరతో చిన్నపాటి సినిమానే తీయవచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
షారుఖ్ ఆస్తి ఎంతో తెలుసా?
ఇదిలా ఉండగా షారుఖ్ ఆస్తి దాదాపు 7,300 కోట్ల రూపాయలు ఉంటుందట. ఇక ఆయన తిరిగే కార్లు(Cars), పెట్టుకునే వాచీల రేట్లు కోట్లల్లో ఉంటాయి. నిజానికి షారుఖ్ కి వాచీలు అంటే తెగ ఇష్టం. ఇక ఇటీవల షారుఖ్ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్లాడు. అప్పుడు ఓ ఖరీదైన వాచ్ పెట్టుకుని మెరిశాడు. ఇకపోతే ఆ వాచ్ ధర ఎంతో తేలేదు కానీ ఆ డబ్బుతో ముంబైలో ఓ లగ్జరీ 2 BHK ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చన్న వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
View this post on Instagram