SharwaNand: ఆకట్టుకుంటున్న శర్వానంద్-అనుపమ ‘భోగి’ టీజర్

టాలీవుడ్‌లో చరిష్మాటిక్ స్టార్ శర్వానంద్(SharwaNand) తన 38వ చిత్రం ‘భోగి(Bhogi)’తో పాన్-ఇండియా స్థాయిలో సందడి చేయడానికి సిద్ధమయ్యాడు. సంపత్ నంది(Sampath Nandi) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఏప్రిల్ 30విడుదలై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది. తాజాగా ఈ మూవీ టీజర్‌(Teaser)ను మేకర్స్ విడుదల చేయగా ఆకట్టుకుంటోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం 1960ల నేపథ్యంలో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో జరిగే ఒక ఉద్వేగభరిత కథగా రూపొందుతోంది. ‘ఫస్ట్ స్పార్క్’ పేరుతో విడుదలైన ఈ కాన్సెప్ట్ టీజర్‌లో శర్వానంద్ కొత్త లుక్‌తో ఆకట్టుకున్నాడు.

అక్టోబర్ 14న విడుదలకు సిద్ధం

సంపత్ నంది వాయిస్‌ఓవర్‌తో కథలోని విధి, సంఘర్షం, పునర్జన్మ అంశాలను సూచనాత్మకంగా పరిచయం చేశారు. టీజర్‌లో శర్వానంద్ కత్తిని స్వీకరించే దృశ్యం, రక్తపాతంతో కూడిన యాక్షన్‌ను సూచిస్తూ, ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అనే ఫ్రేజ్‌తో ప్రేక్షకులను ఆకర్షించింది. అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran), డింపుల్ హయాతి(Dimple Hayathi) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. హైదరాబాద్‌లో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అక్టోబర్ 14న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం శర్వానంద్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *