తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్(Bigg Boss) ముందు వరుసలో నిలుస్తుంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ షో, ఇప్పుడు తొమ్మిదవ(Bigg Boss9) సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పుడు కూడా హోస్ట్‌గా నాగార్జున(Nagarjuna) ఉన్నారు. ఈ సీజన్‌కు సంబంధించిన మొదటి ప్రోమోలో సరికొత్త గేమ్స్, రూల్స్ ఉంటాయని హింట్ ఇచ్చారు.
ఇక హౌస్‌లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్స్ ఎంపికపై బిగ్ బాస్ టీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి ఒక క్రేజీ హీరోయిన్ అడుగుపెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అది మరెవరో కాదు, కన్నడ బ్యూటీ కావ్య శెట్టి(Kavya Shetty). ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి తన నటనతో ఆకట్టుకున్న కావ్య, తెలుగులో “శీతాకాలం”(Shitakalam) అనే చిత్రంలో కీలక పాత్రలో మెరిశారు.
గ్లామర్ లుక్‌తో పాటు నటనలోనూ తనదైన ముద్ర వేసిన ఈ ముద్దుగుమ్మ, బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందట. నాగార్జునతో కలిసి ఓ జ్యూవెలరీ యాడ్‌లో నటించడంతో సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ బాగా పెరిగింది. దీంతో తాజాగా గ్లామర్ ఫోటోషూట్లతో తన క్రేజ్‌ను కొనసాగిస్తూ హౌస్‌లోకి ఎంట్రీకి సిద్ధమవుతోందని సమాచారం.
ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్ బాస్ 9లో పాల్గొనబోయే సెలబ్రిటీల పేర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి బిగ్ బాస్ హౌస్ మరింత ఎంటర్టైనింగ్‌గా మారబోతోందన్న అంచనాలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి నిజంగా కావ్య శెట్టి హౌస్‌లో అడుగుపెడుతుందా? లేదా? అన్నది మాత్రం కొద్ది రోజుల్లోనే స్పష్టమవుతుంది.
View this post on Instagram






