మహారాష్ట్ర సీఎం(Maharastra Cm)గా దేవేంద్ర ఫడ్నవీస్ నేడు ప్రమాణ స్వీకారం(Devendra Fadnavis sworn in today) చేయనున్నారు. ముంబై(Mumbai)లోని ఆజాద్ మైదాన్(Azad Maidan)లో సాయంత్రం 5:30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. అనేక ట్విస్టుల తరువాత, ఇప్పుడు ఫడ్నవీస్‌తో పాటు ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde), అజిత్ పవార్(Ajit Pawar) కూడా ప్రమాణం చేయనున్నారు. శాఖల కేటాయింపులు న్యాయంగా జరుగుతాయని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖరారు చేస్తామని ఫడ్నవీస్ హామీ ఇవ్వడంతో ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister)గా ప్రమాణ స్వీకారం చేసేందుకు షిండే అంగీకరించారు. అయితే హోమంత్రి(Home ministry) పదవి ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సంజయ్ రౌత్ వ్యాఖ్యలు వైరల్
ఇదిలా ఉండగా మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే(interim CM Eknath Shinde) పై శివసేన (UBT) నేత సంజయ్ రౌత్(Sanjay Raut) ఫైరయ్యారు. ఇక మహారాష్ట్ర రాజకీయా(Maharastra Politics)ల్లో షిండే శకం ముగిసిందని, ఆయన మళ్లీ ఎప్పటికీ CM కాలేరని ఎద్దేవా చేశారు. మహాయుతి కూటమి(Mahayuti Alliance) బుధవారం దేవేంద్ర ఫడ్నవీస్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా, షిండేను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటన విడుదల చేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో వైరల్ అవుతున్నాయి.
షిండేను పావులా వాడుకున్నారు..
షిండేను BJP పావులా వాడుకుందని, ఇప్పుడు పక్కకు విసిరేసిందని సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. షిండే శకం ముగిసి రెండేళ్లు అయ్యిందని, ఇప్పుడిక ఆయన అవసరం BJPకి లేదని అన్నారు. అవసరసమైతే షిండే పార్టీని కూడా కమలం పార్టీ విచ్ఛిన్నం చేయగలదని అన్నారు. ఇదంతా ప్రధాని మోదీ(PM Modi) రాజకీయ ఎత్తుగడ అని విమర్శించారు. స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ 15 రోజులైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. అంటే వారి కూటమిలో ఏదో లోపం ఉందని అర్థమౌతుందని అన్నారు. ఇవాళ కాకపోతే తర్వాతైనా బయటికి వస్తుందని సంజయ్ చెప్పుకొచ్చారు.
BJP used Eknath Shinde & threw him away.
He will never be CM of the Maharashtra ever again
— Sanjay Raut pic.twitter.com/z1b2ZsJ36L
— Rohini Anand (@mrs_roh08) December 5, 2024







