‘తండేల్’ అప్డేట్.. కాశీలో ‘శివశక్తి’ సాంగ్ రిలీజ్

Mana Enadu : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్‌ (Thandel Movie)’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి ఫీ మేల్ లీడ్ గా చేస్తోంది. వాస్తవానికి అది ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉన్నా.. షూటింగ్ ఆలస్యమవడం వల్ల దాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీకి పోస్ట్​పోన్ అయింది. ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తుండగా..  అల్లు అరవింద్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి పెద్ద సినిమాలుండటం వల్ల ఈ చిత్రాన్ని సోలోగా ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.

కాశీ ఘాట్ వద్ద శివశక్తి సాంగ్ రిలీజ్

మరోవైపు ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ‘బుజ్జితల్లి’ పాటను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ కు రంగం సిద్ధం చేశారు మేకర్స్. తండేల్ నుంచి ‘శివశక్తి (Shiva Shakti Song)’ పాటను డిసెంబరు 22వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పాట తెలుగు, తమిళం, హిందీ భాషల్లో లాంచ్ చేయనున్నారు. ఈ సాంగ్ ను కాశీ ఘాట్ వద్ద గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మూమీ టీమ్ ప్రకటించింది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

తండేల్ మూవీ స్టోరీ ఇదే

ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తండేల్ మూవీ (Thandel Story) తెరకెక్కుతోంది. సముద్ర తీర ప్రాంతం చుట్టూ ఈ కథ తిరుగనుంది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్థాన్ వరకూ చేరుకుంటుందని మేకర్స్ తెలిపారు. కొందరు మత్స్యకారులు పాకిస్థాన్‌ కోస్టు గార్డులకు చిక్కుతారని.. ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు, కష్టాల గురించి ఈ సినిమాలో చూపించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు  ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. అన్ని భాషల డిజిటల్ రైట్స్​ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​ సుమారు రూ. 40 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలిసింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *