ప్రముఖ యూట్యూబర్(Youtuber), గాయకుడు, బిగ్ బాస్ OTT 2 (Hindi) విజేత అయిన ఎల్విష్ యాదవ్(Elvish Yadav) గురించి సుపరిచితమే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ(wild card entry) ద్వారా హౌస్‌లోకి ప్రవేశించి.. బిగ్ బాస్(Bigg Boss) OTT 2 చరిత్రలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా విజయం సాధించాడు. అతని కెరీర్లో ఒక పెద్ద మైలురాయి. ఈ విజయంతో అతనికి సోషల్ మీడియా(Social Media)లో మరింత గుర్తింపు లభించింది. ఎల్విష్ యాదవ్ యూట్యూబ్‌తోనే బాగా ఫేమ్ దక్కించుకున్నాడు.
కాల్పులు జరిపి పరార్
‘ఎల్విష్ యాదవ్’ అండ్ ‘సిస్టమ్’ అనే రెండు చానెల్స్ బాగా గుర్తింపు పొందాయి. అయితే ఈరోజు (ఆగస్టు 17) తెల్లవారుజామున 5.30 గంటలకు గుర్తు తెలియని దుండగులు ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు జరిపారు. గురుగ్రామ్‌లోని యూట్యూబర్ ఇంటి వద్దకు ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి 24 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఎల్విష్ ఇంటి వద్దకు వచ్చి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరుగలేదని తెలుస్తోంది.
SHOCKING 🚨 Around 25-30 rounds of firing took place today at Elvish Yadav’s house.
Thankfully, he wasn’t present at the time, but his parents were inside when this horrifying attack happened.
Elvish has made a lot of enemies in young age.pic.twitter.com/8P6ibZ0gHx
— Lakshay Mehta (@lakshaymehta31) August 17, 2025






