Ramzan: దుకాణదారులకు ‘రంజాన్’ ఆఫర్.. ఇకపై 24గంటలూ ఓపెన్ చేయొచ్చు!

దుకాణదారులకు తెలంగాణ సర్కార్(Telangana Govt) గుడ్‌న్యూస్ చెప్పింది. రంజాన్(Ramzan) సందర్భంగా స్పెషల్ పర్మిషన్(Special Permission) ఇచ్చింది. ఈ మేరకు మార్చి 2వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు దుకాణాలు(Shops) 24 గంటలూ నడుపుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్‌ సంజయ్‌కుమార్‌(Labor Commissioner Sanjay Kumar) తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. అయితే దుకాణదారులు తప్పని సరిగా ప్రభుత్వ నిబంధనలు(Rules) పాటించాలని స్పష్టం చేశారు. 24 గంటలూ షాపులు ఓపెన్‌ చేయాలనుకునే యాజమానులు సంబంధిత అధికారుల దగ్గర రశీదులు తీసుకోవాలన్నారు.

Ramadan Special: Stampede Over Special Haleem, Know What Is It - NewsX World

అలాగే దుకాణాల యజమానులకు కొన్ని రూల్స్ పెట్టారు. నిబంధనల ప్రకారం సిబ్బందికి సెలవు(Holidays)లు, ఎక్కువ సేపు పనిచేస్తే అదనపు వేతనం ఇవ్వాలని చెప్పింది. అలాగే రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలకు మించి సిబ్బంది పనిచేస్తే సాధారణ జీతం కంటే రెట్టింపు వేతనం ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా హోటళ్లు, తినుబండారాల షాపులతోపాటు ఇతర దుకాణాలకు ఇది వర్తించనుంది.

అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశం

దీంతో పాటు సెలవు రోజుల్లో పనిచేసే ఉద్యోగులకు మరొక రోజు హాలిడే ఇవ్వాలని తెలిపింది. దీంతోపాటు ఆదివారం మినహా ఏ రోజు కూడా పని వేళలు 13 గంటలకు మించకూడదని పేర్కొంది. మహిళా ఉద్యోగులుంటే షరతులతో కూడిన నైట్‌ డ్యూటీ(Conditional night duties)లు వేయాలని వివరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా న్యాయాధికారులు, ఇతర విభాగాల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *