స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్-2023(ODI World Cup) నుంచి టీమ్ఇండియా(Team India) మేనేజ్‌మెంట్ ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. ప్లేయర్లను ప్రోత్సహించడానికి బెస్ట్ ఫీల్డర్ మెడల్(Best Fielder Medal)ను తీసుకువచ్చింది. దీనిని ప్రతి మ్యాచ్‌లో బెస్ట్‌గా ఫీల్డింగ్ చేసిన ఆటగాడిని గుర్తించి ఈ మెడల్‌ను అందిస్తూ వస్తోంది. ఇక ఈ సంప్రదాయాన్ని ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy- 2025) లోనూ కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో వికెట్ కీపర్ KL రాహుల్, పాక్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మెడల్ అందుకున్నాడు. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ బెస్ట్ ఫీల్డర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఇక తాజాగా ఆసీస్‌తో మ్యాచులోనూ ఈ మెడల్ కోసం ముగ్గురు ప్లేయర్లు పోటీపడ్డారు.
సూపర్ రనౌట్ చేసిన అయ్యర్
ఆస్ట్రేలియా(Australia)తో మ్యాచులో అద్భుత క్యాచ్ అందుకున్న శుభ్ మన్ గిల్, సూపర్ బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా(Jadeja), మెరుపు ఫీల్డింగ్‌తో అలెక్స్ క్యారీని రన్ ఔట్ చేసిన శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఈ మెడల్ కోసం కంటెండర్లు ఎంపికయ్యారు. అయితే వీరిలో అయ్యర్‌కే టీమ్ మేనేజ్మెంట్ జై కొట్టింది. రెండు పరుగుకోసం ప్రయత్నించిన క్యారీ(Alex Carey)ని డైరెక్ట్ త్రోతో రన్ ఔట్ చేసిన అయ్యర్‌కే బెస్ట్ ఫీల్డర్ మెడల్ అందించింది.
What a direct hit from shreyas Iyer to get Alex carey run out.
rocket throw……..@ShreyasIyer15 #india #INDvsAUS #cricket #BCCI #ChampionsTrophy2025 pic.twitter.com/lfz4JPcj4H— PREM BISHNOI (@prem_puniya29) March 4, 2025
దీనిని మాజీ క్రికెటర్, కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) చేతుల మీదుగా అయ్యర్‌కి అందించింది. ఈ సందర్భంగా రవిశాస్త్రి ఆటగాళ్లను ఎంకరేజ్ చేశారు. టీమ్ స్పిరిట్ కనబరిచి అద్భుతంగా ఆడారని కొనియాడారు. ఇంక ఒక్క మ్యాచ్ మిగిలి ఉందని, అందులోనూ నెగ్గి ట్రోఫీ కైవసం చేసుకోవాలంటూ ALL THE BEST చెప్పారు.
𝗗𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗥𝗼𝗼𝗺 𝗕𝗧𝗦 | 𝗙𝗶𝗲𝗹𝗱𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗠𝗮𝘁𝗰𝗵 | #INDvAUS
It was a battle of heavyweights 💪
🎙️And there was just one voice that “roared” in the dressing room to announce the winner 🏅😎#TeamIndia | #ChampionsTrophyhttps://t.co/lA6G3SRlG4
— BCCI (@BCCI) March 5, 2025






