
ఇండియన్ ఆస్ట్రోనాట్, IAF గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా(Shubhansu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి నేడు భూమికి తిరిగి రానున్నారు.Axium-4 missionలో భాగంగా జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్(Kennedy Space Center) నుంచి SpaceX Falcon-9 రాకెట్ ద్వారా డ్రాగన్ అంతరిక్ష నౌక(Dragon spacecraft)లో ISSకు చేరుకున్న శుభాంశు.. భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన రెండో వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. ఈ మిషన్‌లో అతనితో పాటు అమెరికాకు చెందిన NASA మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ-విస్నియేవ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కపు ఉన్నారు. ఈ నలుగురు వ్యోమగాములు ISSలో 14 రోజుల పాటు 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించారు.
గురుత్వాకర్షణకు తిరిగి అలవాటు పడటం సవాలే
నాసా ప్రకారం శుభాంశు శుక్లా, ఆయన సహచర వ్యోమగాములు నేడు ఐఎస్ఎస్ నుంచి డ్రాగన్ అంతరిక్ష నౌకలో భూమికి తిరిగి రానున్నారు. వీరిని మోసుకొచ్చే స్పేస్‌ఎక్స్(SpaceX) డ్రాగన్ నౌక ఫ్లోరిడా తీరంలో దిగుతుంది. ఈ ప్రక్రియలో, డ్రాగన్ నౌక ISS హార్మొనీ మాడ్యూల్ నుంచి విడిపోయి భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో వ్యోమగాములు(Astronauts) అధిక గురుత్వాకర్షణ శక్తులను ఎదుర్కొంటారు, ఇవి శరీరంపై ఒత్తిడిని కలిగిస్తాయి. అంతరిక్షంలో దాదాపు 2 వారాలకు పైగా గడిపిన తర్వాత, శుభాంశు, ఆయన సహచరులు భూమి గురుత్వాకర్షణకు తిరిగి అలవాటు పడటం సవాలుగా ఉంటుంది.
28 గంటల ప్రయాణం తర్వాత..
ఆక్సియం-4 మిషన్ నాసా, ఆక్సియం స్పేస్, స్పేస్‌ఎక్స్ సహకారంతో నిర్వహించిన నాలుగో ప్రైవేట్ వ్యోమగామి మిషన్. జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఇది ప్రారంభమైంది. ఈ మిషన్‌లో శుభాంశు శుక్లా మిషన్ పైలట్‌గా వ్యవహరించారు. భారత్ అంతరిక్ష కార్యక్రమంలో ఇదొక మైలురాయి. 28 గంటల ప్రయాణం తర్వాత, జూన్ 26న ISSకు చేరుకున్నారు. ఈ మిషన్‌లో నిర్వహించిన ప్రయోగాల్లో స్పేస్ మెడిసిన్, న్యూరోసైన్స్, వ్యవసాయం, మెటీరియల్ సైన్స్, పర్యావరణ పర్యవేక్షణ రంగాల్లో గణనీయమైన ఫలితాలను అందించాయి.
We don’t get in our flight suits often, but chance had us all decked out so we took advantage and took some photos with our new crewmates.
In this picture we have eight astronauts representing the United States, Japan, India, Hungary and Poland. It’s been a pleasure getting to… pic.twitter.com/l3AWgG9quD
— Jonny Kim (@JonnyKimUSA) July 13, 2025