భారత టెస్టు క్రికెట్ కు కొత్త కెప్టెన్ ఎవరూ అనే ఉత్కంఠకు తెరపడింది. బీసీసీఐ టీం ఇండియా టెస్ట్ కెప్టెన్ గా శుభమన్ గిల్ ను నియమించింది. 2025 జూన్ 20 నుంచి ఇంగ్లండ్ తో ఆ దేశంలో జరగబోయే అయిదు టెస్టు మ్యాచుల (India England Test Series) సిరీస్ కు టెస్ట్ కెప్టెన్ గా గిల్ ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. టెస్టు ఫార్మాట్ లో ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించడంతో జస్ ప్రీత్ బుమ్రా, శుభమన్ గిల్ ఇద్దరిలో ఎవరికీ కెప్టెన్ దక్కుతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు.
ఇండియాలో క్రికెట్ లో నూతన శకం ప్రారంభం
మహామ్మద్ అజారోద్దీన్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ దోనీ, విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ తర్వాత టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు శుభమన్ గిల్ (Shubman Gill) కు దక్కడం విశేషం. దీంతో దిగ్గజాల సరసన శుభమన్ గిల్ చేరిపోయాడు. కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ తో పాటు మొత్తం 18 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది.
టీమ్ ఇండియా జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్). రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.






