3BHK OTT: సిద్ధార్థ్ 3BHK మూవీ డిజిటల్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం.. మిస్ అవ్వకండి

తనదైన శైలిలో పాత్రలు పోషిస్తూ విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలతో దూసుకుపోతున్న బొమ్మరిల్లు సిద్ధార్థ్‌(Siddharth) తాజాగా నటించిన చిత్రం “3BHK”. శరత్ కుమార్‌(Sharath Kumar)తో కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కుటుంబ కథా చిత్రం జూలై 4న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ దగ్గర సక్సెస్‌ సాధించింది.

ఈ చిత్రంలో దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర ఆచార్, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించగా, దర్శకుడు మిస్కిన్ శిష్యుడు శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు అమృత్ రామ్‌నాథ్ అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ(OTT Release)లోకి వచ్చేసింది. ఈ రోజు(Aujust1) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో(Amezon Prime Video), సింప్లీ సౌత్(Simply South) ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో తెలుగు తమిళంలో అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్ అయినవారు ఈ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో చూడొచ్చు. ఇంటిబంధాలు, భావోద్వేగాలతో నడిచే ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కావడంతో, కుటుంబసభ్యులతో కలసి చూడదగ్గ చిత్రం. మీరు మిస్సవకుండా చూసేయండి!

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *