సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తెలుసు కదా’ (Telusukada). ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం కానున్నారు. షూటింట్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. సిద్ధు తనదైన స్టైల్‌లో ఫన్నీగా దీన్ని రివీల్ చేశారు. హీరోయిన్లుగా నటిస్తున్న రాశీ ఖన్నా (Raashii Khanna), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ఇద్దరూ సిద్ధూకు వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నట్లు చూపించారు. ఈక్రమంలోనే దీపావళిని పురస్కరించుకొని అక్టోబర్ 17న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.






