
బంగారం ధరలు(Gold Rates) దోబూచులాడుతున్నాయి. శనివారం (ఫిబ్రవరి 15) ఏకంగా రూ.1000కిపైగా ధగ్గిన పసిడి రేట్లు ఇవాళ మళ్లీ పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. శుభకార్యాల సీజన్ సమయంలో కొంతైన పుత్తడి కొనుగోలు చేద్దామనుకుంటే ధరలు ఆందోళన కలిగిస్తున్నాయని వాపోతున్నారు. కొందరు మాత్రం పెళ్లిళ్లకు బంగారం తప్పని సరని, రేటు ఎంత పెరిగినా కొంచెం అయినా కొనుగోలు చేయక తప్పడం లేదని అంటున్నారు.
కాగా ఇవాళ (ఫిబ్రవరి 17) హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.500 పెరిగి రూ. 79,400 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన గోల్డ్ ప్రైజ్(Gold Price) రూ. 550 పెరిగి రూ.86,620గా ఉంది. మరోవైపు సిల్వర్ రేట్లు(Silver Rate) సైతం పసిడికి ఏమాత్రం తీసిపోవడం లేదు. ఇవాళ కేజీ వెండి ధర రూ.1,08,000వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక ఈ వారంలో మొదటిరోజైన సోమవారం కూడా స్టాక్ మార్కెట్లు(Stock Market) నష్టాల్లో మొదలయ్యాయి. ప్రస్తుతం బీఎస్‌ఇ సెన్సెక్స్(Senxsex) 608.83 పాయింట్లు తగ్గి 75,330.38 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. NSE నిఫ్టీ(Nifty) 194.50 పాయింట్లు తగ్గి 22,734.75 పాయింట్ల వద్ద చలిస్తోంది.