ప్రతిష్ఠాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్(Tennis Grand Slam Wimbledon)లో డిఫెండింగ్ ఛాంపియన్, స్పెయిన్ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) మూడోసారి టైటిల్ నిలబెట్టుకునే అడుగు దూరంలో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కోసం తలపడిన జానిక్ సిన్నర్(Jannik Sinner), కార్లోస్ అల్కరాజ్ మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం పోటీపడనున్నారు. సెమీస్(Semis)లో అద్భుతమైన విజయాలు సాధించిన వీళ్లిద్దరూ వింబుల్డన్ ఫైనల్స్(Wimbledon Final)కు చేరుకున్నారు. గత రెండు వింబుల్డన్ టైటిల్స్ నెగ్గిన అల్కరాజ్.. ముచ్చటగా మూడోసారి కూడా నెగ్గి, ఈ ఘనత సాధించిన ఐదో టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాలని తహతహలాడుతున్నాడు. అటు ప్రెంచ్ ఓపెన్(French Open) ఫైనల్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సిన్నర్ భావిస్తున్నాడు.

జకోవిచ్‌కు సిన్నర్ షాక్
తొలి సెమీఫైనల్ మ్యాచులో అల్కరాజ్ కూడా ధాటిగా ఆడాడు. USకు చెందిన టేలర్ ఫ్రిట్జ్‌తో జరిగిన ఈ మ్యాచులో 6-4, 5-7, 6-3, 6-1 తేడాతో అల్కరాజ్ విజయం సాధించి.. తన కెరీర్లో ఆరో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. అటు సెంటర్ కోర్ట్‌లో జరిగిన రెండో సెమీఫైనల్‌లో లెజెండరీ ప్లేయర్ నొవాక్ జకోవిక్(Novak Djokovic)ను సిన్నర్ చిత్తుగా ఓడించాడు. జకోకు ఏమాత్రం అవకాశం ఇవ్వని సిన్నర్.. 6-3, 6-3, 6-4 తేడాతో వరుస సెట్లను తన ఖాతాలో వేసుకొని వింబుల్డన్ ఫైనల్స్‌కు దూసుకొచ్చాడు. రేపు(జులై 13) జరిగే ఫైనల్లో సిన్నర్‌తో తాడోపేడో తేల్చుకోనున్నాడు.
Carlos Alcaraz is a #Wimbledon finalist for the THIRD YEAR IN A ROW 😮
The two-time defending champion defeats Taylor Fritz 6-4, 5-7, 6-3, 7-6(6) to put one hand on the Gentlemen’s Singles Trophy – and Centre Court ROARS for the Spaniard 🇪🇸
Utterly sensational. pic.twitter.com/Twy6y6vK6V
— Wimbledon (@Wimbledon) July 11, 2025
ఉమెన్స్ ఫైనల్‌లో అనిసిమోవాతో స్వియాటెక్ ఢీ
వింబుల్డన్ మహిళల సింగిల్స్(Wimbledon Women’s Singles), పురుషుల డబుల్స్ ఫైనల్(Men’s Doubles Final) మ్యాచులు ఇవాళ జరగనున్నాయి. అమెరికాకు చెందిన అమండా అనిసిమోవా(Amanda Anisimova)తో పోలాండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్(Iga Swiatek) తలపడనుంది. లండన్‌లోని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్‌లోని సెంటర్ కోర్టులో జరగనుంది. ఫైనల్‌లో వీరిద్దరూ మొదటిసారి వింబుల్డన్ టైటిల్ కోసం పోటీపడటం ఇదే తొలిసారి. మరోవైపు పురుషుల డబుల్స్‌లో రింకీ హిజికటా, డేవిడ్ పేల్-జూలియన్ క్యాష్, లాయిడ్ గ్లాస్‌పూల్ జోడీలు టైటిల్ కోసం తలపడనున్నాయి.







