భారత టెస్ట్ క్రికెట్ చరిత్ర(History of Indian Test Cricket)లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. బ్యాటింగ్(Batting), బౌలింగ్(Bowling), ఫీల్డింగ్లో(Fileding) తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. తాజాగా ఇంగ్లండ్(England) జరుగుతున్న టెస్ట్ సిరీస్(Test Series)లో భాగంగా ‘సర్’ జడేజా మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఇంగ్లండ్ గడ్డపై 1000 టెస్ట్ పరుగులు పూర్తి చేయడమే కాకుండా, 30కి పైగా వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి ఆసియా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోనే ఈ అద్భుతమైన ఘనతను సాధించిన మూడో ఆల్ రౌండర్ జడేజా నిలిచాడు.

బ్యాటింగ్ దిగ్గజాల సరసన జడేజా
ఇంతకుముందు ఇంగ్లండ్(England) దిగ్గజ ఆల్ రౌండర్ విల్ఫ్రెడ్ రోడ్స్ (ఆస్ట్రేలియాలో 1032 పరుగులు, 42 వికెట్లు), వెస్టిండీస్(West Indies) లెజెండ్ సర్ గ్యారీ సోబర్స్ (ఇంగ్లండ్‌లో 180 పరుగులు, 62 వికెట్లు) మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఈ జాబితాలో జడేజా చేరడం, అది కూడా ఆసియా ఖండం నుంచి తొలి ఆటగాడిగా అరుదైన ఘనత అందుకోవడం విశేషం. ఇంగ్లండ్ గడ్డపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఏడో భారత బ్యాటర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. తద్వారా బ్యాటింగ్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), విరాట్ కోహ్లి(Virat Kohli) సరసన చేరాడు.

బ్యాటింగ్‌లో అద్భుతమైన ఫామ్‌లో జడ్డూ
ఇంగ్లండ్‌లో స్పిన్సర్లకు అంతగా అనుకూలించని పిచ్‌పై ఒక ఆల్ రౌండర్‌గా ఇలాంటి ప్రదర్శన చేయడం జడేజా సామర్థ్యానికి నిదర్శనం. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో జడేజా బ్యాటింగ్‌లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే 5 అర్ధసెంచరీలు సాధించి, భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. బౌలింగ్‌లో అంచనాలకు తగ్గట్టుగా వికెట్లు తీయకపోయినా, కీలక సమయాల్లో బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టుకు అండగా నిలుస్తున్న జడ్డూపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
36 years old, Batting, Fielding, Bowling. T20I, ODIs, Tests. No sledging, No barking. No fitness PR. Just pure cricket.
Nobody can hate Sir Ravindra Jadeja.🐐 pic.twitter.com/ZI2LWJ8Md4
— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 (@ImHydro45) July 27, 2025






